Gopichand Malineni: మామూలుగా ఒక హీరో కోసం రాసుకున్న కథ మరొక హీరో చేతికి వెళ్లడం చాలా కామన్. ఒక హీరోను మైండ్‌లో పెట్టుకొని ఒక దర్శకుడు కథ రాసుకున్నా కూడా ఆ కథ ఆ హీరోకు నచ్చితే వేరొక హీరో దగ్గరకు వెళ్లడం అనేది ప్రతీ ఇండస్ట్రీలో జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ హీరోల విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. వారికి ఎప్పుడు ఎలాంటి కథలు నచ్చుతాయో ఊహించడం కష్టం. ఒక జోనర్ కథ తమకు హిట్ తెచ్చి పెట్టిందంటే వరుసగా అదే కథల్లో నటించడానికి హీరోలు ఇష్టపడతారు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బాలకృష్ణ కూడా ఇదే ఫార్ములాను అవుతారు. అందుకే తను చెప్పిన కథను రిజెక్ట్ చేశాడని దర్శకుడు వాపోయాడు.
వర్కవుట్ అవ్వలేదు
గోపీచంద్ మలినేని ఇప్పటివరకు టాలీవుడ్‌లోనే మాస్ కమర్షియల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ‘జాట్’ సినిమాతో ఏకంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బీ టౌన్ సీనియర్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol)తో కలిసి ‘జాట్’ (Jaat) తెరకెక్కించాడు గోపీచంద్ మలినేని. అసలు ఈ మూవీ గురించి అనౌన్స్‌మెంట్ రాగానే ఈ కాంబినేషన్ ఎలా కుదిరిందా అని అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ హిట్‌గా నిలిచింది. అయితే ‘జాట్’ మూవీని ముందుగా బాలకృష్ణతో తెరకెక్కించాలని అనుకున్నాడట గోపీచంద్ మలినేని. కానీ వారి కాంబోలో ఈ మూవీ ఎందుకు వర్కవుట్ అవ్వలేదో కూడా తాజాగా బయటపెట్టాడు.
మాట మార్చారు
‘‘నేను ముందుగా జాట్ కథతో బాలకృష్ణ (Balakrishna)ను కలిశాను. ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. కానీ అఖండ రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత అంతా మారిపోయింది. నేను క్రాక్ సినిమా తీసిన వెంటనే జాట్ కథతో బాలకృష్ణను కలిశాను. ఆయన ముందు ఒప్పుకున్నా కూడా అఖండ తర్వాత ఆలోచనలు మార్చుకున్నారు. అప్పుడు బాలయ్యపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయానని, ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథ అయితేనే ఆ అంచనాలు అందుకోగలుగుతుందని ఆయన భావించారు. అందుకే ఆయనతో కలిసి వీర సింహారెడ్డి చేశాను’’ అని వివరించాడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). 2023లో విడుదలయిన వీర సింహారెడ్డి కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.
Also Read: మలేషియాలో ప్రభాస్ ఓకే అన్నాడు.. ఇండియా వచ్చాకే లెక్కలు మారిపోయాయి..
మంచి కలెక్షన్స్
‘జాట్’ సినిమా విడుదలయ్యి ఇప్పటికి మూడు వారాలు అయ్యింది. ఈ మూడు వారాల్లో మరెన్నో సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. అయినా కూడా ఇప్పటికీ ‘జాట్’ను చూడడానికి థియేటర్లకు వెళ్తున్న ప్రేక్షకులు ఉన్నారు. 20వ రోజు కూడా దాదాపు రూ.65 లక్షల కలెక్షన్స్ సాధించింది ఈ మూవీ. ఇప్పటికే ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.86.30 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఎలాగైనా సినిమా రూ.100 కోట్ల మార్క్ టచ్ చేస్తే బాగుంటుందని సన్నీ డియోల్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మే 1న ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో తెలుగు, హిందీ నుండి భారీ బడ్జెట్ చిత్రాలు పోటీకి దిగనున్నాయి కాబట్టి ‘జాట్’ రన్ దాదాపుగా ముగిసినట్టే అని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు.