BigTV English

Gopichand Malineni : మలేషియాలో ప్రభాస్ ఒకే అన్నాడు.. ఇండియా వచ్చాకే లెక్కలు మారిపోయాయి..

Gopichand Malineni : మలేషియాలో ప్రభాస్ ఒకే అన్నాడు.. ఇండియా వచ్చాకే లెక్కలు మారిపోయాయి..

Gopichand Malineni : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విలక్షణమైన దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. 2010లో విడుదలైన డాన్ శీను చిత్రంతో దర్శకుడిగా అడుగుపెట్టిన గోపీచంద్ మలినేని, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ ని అందుకని సత్తా చాటారు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను తెరకెక్కించడంలో ఈయన దిట్టా. తాజాగా ఈ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డాన్ శీను మూవీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే..


ఇండియా వచ్చాకే లెక్కలు మారిపోయాయి..

గోపీచంద్ మలినేని ఫస్ట్ తెలుగు మూవీ డాన్ శీను. రవితేజ హీరోగా, శ్రియ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో ఆలీ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ గురించి డైరెక్టర్ ను ఓ ఇంటర్వ్యూలో మీరు మొదట సినిమా తీయడానికి అవకాశం ఎలా వచ్చింది అని ఎదురైన ప్రశ్నకు, గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘ఎవరికి అవకాశం ఈజీగా రాదు. అలా ఈజీగా వచ్చినా కిక్ ఉండదు. ఫస్ట్ డాన్ శీను స్క్రిప్ట్ అనుకున్నప్పుడు.. మలేషియాలో బిర్లా మూవీ టైం లో ప్రభాస్ కి స్టోరీ లైన్ చెప్పాను. అప్పుడు ఆయనే అడిగాడు గోపి నువ్వు డైరెక్షన్ వైపుకు వెళ్లొచ్చు కదా అని, నీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్పమన్నప్పుడు నేను ఈ స్టోరీ ని ప్రభాస్ కి వినిపించాను. అప్పుడే ప్రభాస్ ప్రొడ్యూసర్ గోపికృష్ణ మూవీస్ నరేంద్రతో నేను నెక్స్ట్ గోపితో చేస్తాను. మంచి ఐడియా చెప్పాడు అని ప్రభాస్ అన్నారు. నా ముందే మలేషియాలో ఇదంతా జరిగింది. తర్వాత ఇండియా వచ్చాక ప్రభాస్ వేరే ఫిలింకి వెళ్లడం, ఇక నేను ఈ కథను దిల్ రాజు గారికి చెప్పాను. ఆయన హీరో గోపీచంద్ అయితే ఎలా ఉంటుంది అని అడిగాను. ఇది రవితేజ బాగుంటుంది అని ఆయన చెప్పారు. అప్పుడు మేము రవితేజ గారితో స్టోరీ చెప్పడం ఆయన పది నిమిషాలలో ఓకే చెప్పేయడం జరిగిపోయింది. స్వతహాగా రవితేజ గారు అమితాబచ్చన్ ఫ్యాన్. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఆయనకి బాగా సూట్ అయింది. ఆ పాత్రకు ఆయన బాగా న్యాయం చేశాడు. ఇక సినిమాలో డాన్ శీనుగా అందరి ముందుకు తీసుకు వచ్చాము అని గోపీచంద్ తెలిపారు.


బాలీవుడ్ లో ఎంట్రీ …కెరియర్ ..

ఇక గోపీచంద్ మలినేని సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఎక్కువగా రవితేజ తోనే సినిమాలు తీశారు. 2010 నుంచి 2025 వరకు ఆయన మొత్తం ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించగా, అందులో మూడు చిత్రాలు రవితేజవి ఉండడం విశేషం. డాన్ శీను హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అదే ఆయన డైరెక్షన్ లో బాడీగార్డ్, బలుపు, పండగ చేసుకో, విన్నర్, క్రాక్, వీర నరసింహారెడ్డి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ ను నెలకొల్పాయి. ఇటీవల జాట్ సినిమాతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చారు గోపీచంద్ మలినేని. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో తెలుగులో విజయం సొంతం చేసుకోకపోయినా, బాలీవుడ్ లో మాత్రం రికార్డ్స్ న కొల్లగొట్టింది. తాజాగా గోపీచంద్ బాలకృష్ణతో మరోసారి సినిమా చేస్తున్నట్లు సమాచారం.

Nani: హీరోయిన్ ని భయపెట్టిన నాని… షాక్ లో యాంకర్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×