Allu Arjun : సినిమా అంటే రంగుల ప్రపంచం… సినిమా అంటే ఊహాల ప్రపంచం. ఇవి ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఊహల ప్రపంచం అనేదాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కొంతమంది. ఊహల ప్రపంచం అంటే అన్నీ ఊహించుకుని, ఏదేదో… క్రియేట్ చేస్తున్నారు.
అలా… సినిమా అంటే ఊహా ప్రపంచం అనే దాన్ని సినిమా అంటే… గాసిప్ ప్రపంచంగా మార్చేశారు. ఈ మధ్య కాలంలో దీన్ని కూడా రుజువు చేయడానికి చాలా సంఘటనలు జరిగాయి. అందులో ఒక దాని గురించి ఇప్పుడు చూద్ధాం…
అల్లు అర్జున్… పుష్ప 2 తర్వాత చేసే సినిమా గ్లోబల్ స్థాయిలో ఉండాలని చూస్తున్నాడు. అందుకే త్రివిక్రమ్‌తో చేయాల్సిన మైథాలజీ కాన్సెప్ట్ మూవీని పక్కన పెట్టి… అట్లీతో స్కైఫై థ్రిల్లర్ మూవీని ముందుగా పట్టాలెక్కిస్తున్నాడు. ఈ మూవీని అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇటీవల వచ్చేసింది. బన్నీ బర్త్ డే రోజు అమెరికాలోని ఓ ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ ఆఫీస్‌లో అల్లు అర్జున్ – అట్లీ కలిసి తిరిగి… అక్కడే సినిమా పై అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అలాగే… ఈ సినిమా గ్లోబల్ రేంజ్‌ను టచ్ అయ్యేలా… స్కైఫై థ్రిల్లర్ జానర్‌లో ఉంటుందని క్లూ ఇచ్చారు.
ఇదింత పక్కన పెడితే… ఈ సినిమాపై ఇటీవల సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. అందులో ఒక పాయింట్ అంటే.. హీరోయిన్. ఈ సినిమా గ్లోబల్ రేంజ్‌కు రీచ్ అయ్యేలా చేస్తున్నారు కాబట్టి.. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తీసుకున్నారనే ఓ గాసిప్ కాస్త గట్టిగానే వండారు.
అక్కడితో ఆగిపోలేదు… ఆ వెంటనే, కొద్ది రోజుల తర్వాత అల్లు అర్జున్ సినిమాను ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసింది అని మరో మసాల బిర్యానీని కూడా వండారు. రెండు కూడా అందరికీ గట్టిగానే కనెక్ట్ అయ్యాయి. అయితే దీనిపై అసలు నిజం ఇప్పుడు బయటికి వస్తుంది. వరుస గాసిప్స్‌పై అల్లు అర్జున్ సన్నిహితులు స్పందించారు.
అసలు అల్లు అర్జున్ – అట్లీ మూవీకి సంబంధించి హీరోయిన్ పాత్ర కోసం ప్రియాంక చోప్రాను అసలు కనీసం సంప్రదించలేరట. అసలు సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రియాంక చోప్రా సెట్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువే ఉందట. అంతే కాదు… అసలు హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించాల్సిన లిస్ట్‌లో ప్రియాంక చోప్రా పేరే లేదని కూడా చెబుతున్నారు.
దీంతో ఇప్పటి వరకు అందరూ షేర్ చేసుకుంటూ వచ్చిన ఆ రెండు వార్తలు గాలిలో పుట్టిన గాసిప్ వార్తలేనా… అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.