Amitabh Bachchan:బాలీవుడ్ బిగ్ బీ గా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈయన.. ఈమధ్య వయసు మీద పడుతున్నా కూడా ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. గత ఏడాది ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898AD’ సినిమాలో యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరినీ అబ్బురపరిచారు. ఈయన నటన చూసి.. ఈ వయసులో కూడా ఎలా సాధ్యం అంటూ చాలామంది ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ నటనకు వయసు సంబంధం లేదు అంటూ నిరూపిస్తూ.. ఎప్పటికప్పుడు తన స్టామినా ఏంటో చూపిస్తున్న అమితాబ్ కి తాజాగా నెటిజన్ నుంచి ఒక కొంటె ప్రశ్న ఎదురయ్యింది. మరి దానికి ఆయన సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
50 మిలియన్స్ దిశగా అమితాబ్ ప్రయత్నాలు..
సోషల్ మీడియా వేదికగా తరచూ అభిమానులతో ముచ్చటించే అతి కొద్దిమంది సెలబ్రిటీలలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. ఈయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను నిత్యం పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఎక్స్ లో తన ఫాలోవర్స్ ను పెంచుకోవడంపై తాజాగా దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఆయన 49 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను ఎక్స్ ఖాతాలో కలిగి ఉన్నారు. ఇప్పుడు దానిని 50 మిలియన్స్ చేయడానికి సలహాలు ఇవ్వమని కోరుతూ.. తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్.. ఎవరికి తోచిన విధంగా వారు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
బిగ్ బి కొంటె సలహా ఇచ్చిన నెటిజన్..
అందులో కొంతమంది మీ భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) తో కలిసి ఫోటోలు దిగి, వాటిని షేర్ చేయండి అని అడగగా.. మరి కొంతమంది ఆరోగ్యానికి సంబంధించిన, విద్యకి సంబంధించిన పలు విషయాల గురించి కూడా అభిప్రాయాలు పంచుకోండి అని అడిగారు. అయితే ఇక్కడ మరొక నెటిజన్ మాత్రం కాస్త ముందడుగు వేసి.. “మీ మాజీ ప్రేయసి రేఖ గారితో కలిసి ఒక సెల్ఫీ దిగండి ” అంటూ కామెంట్ చేయగా.. ఇక ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి దీనిపై బిగ్ బీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అటు నెటిజెన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. మరి చూద్దాం దీనికి అమితాబ్ రియాక్షన్ ఎలా ఉంటుందో.
అమితాబ్ – రేఖ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు..
ఇకపోతే నటి రేఖ, అమితాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. ముఖ్యంగా దో అంజానే, రామ్ బలరాం, గంగా కీ సౌగంద్, అలా ప్, కూన్ పసీనా, సిల్ సిలా వంటి చిత్రాలలో కలిసి నటించారు. ముఖ్యంగా అలా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరి అనుబంధం పై ఎన్నో రకాల రూమర్లు వినిపించాయి. పైగా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. కానీ మధ్యలో జయాబచ్చన్ ఎంట్రీ ఇవ్వడంతో రేఖ తప్పుకుందని గతంలో వార్తలు వినిపించాయి. ఇక తర్వాత జయా బచ్చన్ ను అమితాబచ్చన్ వివాహం చేసుకొని, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అటు రేఖా కూడా 1990లో ముఖేష్ అగర్వాల్ వివాహం చేసుకుంది. కానీ అతడు అదే ఏడాది మరణించడంతో ఆమెపై చాలామంది విమర్శలు గుప్పించారు.
Niharika: అదరగొట్టేసిన నిహారిక.. త్వరలో మరో తెలుగు మూవీలో ఛాన్స్..!