BigTV English

Puri Jagannath : బెగ్గర్ మూవీలో డర్టీ హీరోయిన్… ఊహించడానికి బానే ఉన్నా… అది నిజం కాదు

Puri Jagannath : బెగ్గర్ మూవీలో డర్టీ హీరోయిన్… ఊహించడానికి బానే ఉన్నా… అది నిజం కాదు

Puri Jagannath :డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ఒకప్పుడు మహేష్ బాబు (Maheshbabu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రామ్ చరణ్ (Ram Charan), రవితేజ (Raviteja) లాంటి స్టార్ హీరోలకు మంచి విజయాన్ని అందించారు. అలాంటి ఈయన ప్రస్తుతం ఒక్క హిట్ అయిన కొట్టాలి అని చాలా ఈగర్ గా ఎదురు చేస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడడంతో నెక్స్ట్ సినిమాపైనే ఆశల్ని పెట్టుకున్నారు.అయితే పూరీ జగన్నాథ్ కి తెలుగు హీరోలు ఎవరూ కూడా డేట్స్ ఇవ్వకపోవడంతో చివరికి తమిళ హీరోతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా తమిళ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో పూరీ జగన్నాథ్ ‘బెగ్గర్ ‘ అనే సినిమా చేస్తున్నారు.


పూరీ జగన్నాథ్ బెగ్గర్ మూవీలో విద్యాబాలన్..

పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న ఈ బెగ్గర్ అనే సినిమాలో ప్రధాన పాత్రలలో కొంతమందిని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు రాగా.. అందులో సీనియర్ బాలీవుడ్ నటి టబూ (Tabu) తో పాటు రాధిక ఆప్టే (Radhika Apte), నిహారిక ఎన్.ఎమ్ (Niharika NM),  నివేదా థామస్ (Nivedha thomas)  ఈ నలుగురు కూడా ఈ సినిమాలో దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లే. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబోలో రాబోయే ఈ సినిమాలో మరో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నటిస్తున్నట్టు రూమర్లు వినిపించాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు విద్యాబాలన్ (Vidhya Balan).. బాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న విద్యాబాలన్ తెలుగువారికి కూడా సుపరిచితురాలే..అయితే విద్యాబాలన్ ని పూరీ తన సినిమాలో తీసుకున్నట్టు నిన్న మొన్నటి నుండి వార్తలు కోలీవుడ్లో తెగ వైరల్ అవుతున్నాయి.


ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన యూనిట్..

అయితే తాజాగా ఈ వార్తలపై మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. “మా సినిమాలో విద్యాబాలన్ ని తీసుకున్నట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. మేము ఆమెను సంప్రదించలేదు.. ఇక ఈ సినిమాలో నటించే వారికి సంబంధించిన విషయాలు త్వరలోనే చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమాలో విద్యాబాలన్ నటించడం లేదని అందరికీ అర్థమైంది. ఇకపోతే “పూరి జగన్నాథ్ మూవీలో విద్యాబాలన్” అనే మాట ఊహించుకోవడానికి బాగానే ఉన్నా.. అది నిజం కాదని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి తో పాటు బాలీవుడ్ బ్యూటీస్ కూడా ఉండడంతో పూరీ జగన్నాథ్ తన నెక్స్ట్ సినిమాని భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నారనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పూరీ జగన్నాథ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి కూడా వెళ్లబోతోంది అని చెప్పవచ్చు.

ALSO READ:Andhra King Taluka : తేడా వస్తే రామ్ కు కూడా వాచిపోద్ది… పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా మరి..!

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×