BigTV English

Wagyu Beef: ఈ మాంసాన్ని 100 రోజులు నిల్వ ఉంచి మరీ తింటారు.. మరి కుళ్లిపోదా?

Wagyu Beef:  ఈ మాంసాన్ని 100 రోజులు నిల్వ ఉంచి మరీ తింటారు.. మరి కుళ్లిపోదా?

BIG TV LIVE Originals: సాధారణంగా బీఫ్ ధర ఎంత ఉంటుంది? కేజీ రూ. 200 ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే బీఫ్ ధర ఏకంగా కేజీ రూ. 2 లక్షలు ఉంటుంది. ఏంటీ.. షాకయ్యారా? కానీ, మీరు విన్నది నిజం. వాగ్యు బీఫ్ ధర కిలో రూ. 2 లక్షలకు పైనే ఉంటుంది. ఇంతకీ ఈ మాంసం ప్రత్యేకత ఏంటి? దానికి అంత ధర ఎందుకు ఉంటుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


జపాన్ లో లభించే శ్రేష్టమైన బీఫ్

వాగ్యు బీఫ్ అనేది జపాన్ లో లభిస్తుంది. ఇది ఓ ప్రత్యేకమైన పశుమాంసం. అత్యంత మృదువుగా, ఎంతో రుచిగా ఉండటం ఈ మాంసం ప్రత్యేకత. కొవ్వులతో కూడిన ఈ మాంసానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. నిజానికి వాగ్యు అంటే.. ‘వా’ అంటే జపనీస్.. ‘గ్యు’ అంటే ఆవు అని అర్థం. అంటే శ్రేష్టమైన జపనీస్ ఆవు మాంసమే ఈ వాగ్యు బీఫ్. ఈ వాగ్యు బీఫ్ కిలో ధర రూ. 50,000 నుంచి రూ. 2,00,000 వరకు ఉంటుంది. ఈ బీఫ్ లో A5 అనేది టాప్ క్వాలిటీని సూచిస్తుంది.


వాగ్యు బీఫ్ ప్రత్యేకత ఏంటి?

⦿ మృదుత్వం: వాగ్యు బీఫ్ కండరాలలో ఎక్కువగా కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు మాంసాన్ని చాలా మృదువుగా చేస్తుంది.

⦿ చక్కటి రుచి: వాగ్యు బీఫ్ లోని కొవ్వు రుచి చాలా చక్కగా ఉంటుంది. ఇది మాంసానికి ఒక సున్నితమైన, చక్కటి  రుచిని అందిస్తుంది. ఈ బీఫ్ లో కొవ్వులు మాంస కండరాలతో కలిసిపోయి ఉండటం వల్ల ఒకరకమైన ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది.

⦿ వాగ్యు బీఫ్ రకాలు: వాగ్యు బీఫ్ లో నాలుగు ప్రధాన రకాలు ఉంటాయి. కోబ్ (కొబ్), మట్సుసాకా, యోనెజావా, ఓమి గా విభజించారు.

⦿ వాగ్యు బీఫ్ గ్రేడింగ్: వాగ్యు బీఫ్ ను క్వాలిటీకి అనుగుణంగా గ్రేడింగ్స్ ఇస్తారు. టాప్ క్వాలిటీని A5 గ్రేడ్ గా గుర్తిస్తారు. దీనికి మార్కెట్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కేజీ సుమారు రూ. 2 లక్షల వరకు పలుకుతుంది.

⦿ జపాన్ ప్రత్యేక వంటకం: వాగ్యు బీఫ్ అనేది జపాన్ ప్రత్యేక ఆహారం. ఇక్కడి నుంచి ఈ మాంసం కొన్ని ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే, జపాన్ లో ఈ మాంసంతో చేసే ఆహారాలు చాలా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా వాగ్యు బీఫ్ ను స్టీక్, రోస్ట్ బీఫ్, ఇతర వంటకాలలో ఉపయోగిస్తారు. సాధారణ బీఫ్ తో పోల్చితే అన్ని రకాలు ఎంతో మెరుగ్గా ఉంటుంది.

ప్రత్యేక పరిస్థితులలో వాగ్యు పశువుల పెంపకం

వాగ్యు మాంసం కోసం జపాన్‌లోని కోబ్, మియాజాకి ప్రాంతాలలో వాగ్యు పశువులను పెంచుతారు. రైతులు వాటికి ప్రత్యేకమైన ఆహార ధాన్యాలు ఇచ్చి పెంచుతారు. కొన్నిసార్లు బీర్ కూడా తాపిస్తారు. నియంత్రిత వాతావరణంలో 30 నెలల వరకు వాటిని పెంచుతారు. ఆ తర్వాత వాటి నుంచి బీఫ్ ను తీస్తారు.

3 నెలలకు పైగా నిల్వ

వాస్తవానికి వాగ్యు బీఫ్ అనేది పొడిగా. తడిగా, ఎలా ఉన్నా ధర అధికంగానే ఉంటుంది. ఈ మాంసం ప్రత్యేక పరిస్థితులలో ఏకంగా 100 రోజుల వరకు నిల్వ చేసే అవకాశం ఉంటుంది. మాంసం చెడిపోకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్రిజ్ లో ఉంచుతారు. కొన్నిసార్లు ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసి తింటారు. ప్రత్యేక పరిస్థితులలో పెంచిన పశువుల నుంచి తీసిన ఈ మాంసానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ధరలు ఎక్కువగా ఉన్నా, ఈ మాంసాన్ని పలు దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Read Also: చూడగానే గుండె జారిందా? ఈ బిల్డింగ్ డిజైన్ చూస్తే ఏం గుర్తొస్తోంది?

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×