Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఓ అరుదైన ప్లేయర్ తెరపైకి వచ్చాడు. 14 సంవత్సరాలు ఉన్న వైభవ్ సూర్యవంశీ… రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడి… తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు ఈ కుర్రాడు. అయితే 35 బంతుల్లోనే సెంచరీ చేయడంతో వైభవ్ సూర్యవంశం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి ఈ వచ్చాడు ఈ కుర్రాడు ? వైభవ్ సూర్య వంశీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? నిజంగానే 14 సంవత్సరాలు ఉన్నాడా అని అందరూ సెర్చ్ చేస్తున్నారు.
ALSO READ: Virat Kohli : కోహ్లీ రిటైర్మెంట్.. రోడ్లపై సంబరాలు చేసుకుంటున్న పాకిస్థాన్
పదో తరగతి ఫెయిల్ అంటూ వైభవ్ పై ట్రోలింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సెంచరీ చేసిన వీరుడు వైభవ్ సూర్యవంశీ పదవ తరగతి ఫెయిల్ అయ్యాడని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏదో ఒక సెంచరీ చేశాడని అతని మెచ్చుకోవాలి కానీ… అసలు ఆ కుర్రాడి వయసు 14 సంవత్సరాలు కాదని కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక ఇప్పుడు ఆ కుర్రాడు పదవ తరగతి కూడా ఫెయిల్ అయ్యాడని… దారుణంగా ఆడుకుంటున్నారు. అయితే.. వైభవ్ సూర్య వంశీ పదవ తరగతి ఫెయిల్ అయ్యాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో…. అతని గ్రామానికి సంబంధించిన కొంతమంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైభవ్ సూర్య వంశీ పదవ తరగతి ఇంకా చదవలేదని… ప్రస్తుతం 9వ తరగతి మాత్రమే చదువుతున్నాడని క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ ట్రోలింగ్ కు చెక్ పెట్టినట్లు అయింది.
వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ ద్వారా తెరపైకి వచ్చిన వైభవ్
ఐపిఎల్ 2025 టోర్నమెంట్లో వైభవ్ సూర్యవంశీ ఇంతలా రాణించడానికి చాలానే కారణాలు ఉన్నాయి. మొదట వైభవ్ సూర్యవంశం బ్యాటింగ్ చూసి వివిఎస్ లక్ష్మణ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి అలాగే రాహుల్ ద్రావిడ్ కు సమాచారం ఇచ్చాడు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మెంటర్గా రాహుల్ ద్రావిడు ఉన్న సంగతి తెలిసిందే. మెగా వేలం రావడంతో వెంటనే రాహుల్ ద్రావిడ్ చొరవతో రాజస్థాన్ రాయల్స్… కోటి రూపాయలకు పైగా పెట్టి.. వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేసింది. అలా ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ప్లేయర్గా మారిపోయాడు ఈ 14 సంవత్సరాల కుర్రాడు సూర్యవంశీ.
Also Read: Select Shreyas Iyer: అప్పుడు ధనశ్రీ, ఇప్పుడు చాహల్ కొత్త ప్రియురాలు.. అయ్యర్ పాడు పనులు ?
వైభవ్ సూర్య వంశీ వెనుక పడుతున్న హీరోయిన్ ?
వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా రాణించిన నేపథ్యంలో.. అతనిపై మనసు పారేసుకున్నట్లు టాలీవుడ్ నటి కుషిత కల్లపు ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. 14 ఏళ్ల కుర్రాడే కానీ అద్భుతంగా రాణిస్తున్నాడని… ఇలాంటి ఆటగాడు టీమిండియాలోకి రావాలని ఆమె పేర్కొన్నారు. దీంతో ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
?igsh=cDN4YTNhczVxYmYz