Govindh Naamdev : గత నాలుగు రోజుల క్రితం ఒక పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 31 సంవత్సరాల వయసున్న నటి 71 సంవత్సరాల వయసున్న సీనియర్ నటుడితో ప్రేమలో పడింది అంటూ వచ్చిన ఆ పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి తోడు వీరిద్దరూ క్లోజ్ గా ఉండే ఫోటోతో పాటు “ప్రేమకు హద్దులు లేవు.. వయసు పరిమితులు అంతకంటే లేవు” అంటూ క్యాప్షన్ కూడా జోడించడంతో ఇక ఆమె అతడిని డబ్బు కోసమే వివాహం చేసుకోబోతోంది అంటూ చాలా మంది విమర్శలు గుప్పించారు. ఇంకొంతమంది కెరియర్లో అవకాశాలు లేకే డబ్బున్నోడిని పట్టేసి, అతడితో పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ చాలా దారుణంగా నెటిజన్స్ కామెంట్లు చేశారు.
అవును ప్రేమించుకుంటున్నాము..
అయితే తాజాగా దీనిపై స్పందించిన గోవింద్ నాం దేవ్ (Govindh Naamdev) పుకార్లకు స్వస్తి పలికారు.. గోవింద్ నామ్ దేవ్ మాట్లాడుతూ.. “అవును ప్రేమించుకుంటున్నాము. కాకపోతే నిజ జీవితంలో కాదు రీల్ లైఫ్ లో.. నేను శివంగి వర్మ (Shivangi verma) కలసి ‘గౌరీశంకర్ గోహార్ గంజ్’ అనే సినిమాలో నటిస్తున్నాము. ఇండోర్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక ముసలి వ్యక్తి యంగ్ లేడీతో ప్రేమలో పడతాడు. అదే ఈ సినిమా కథ కూడా అయితే ఈ సినిమాలో భాగంగానే శివంగి వర్మ ఈ పోస్ట్ చేసింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ప్రమోషన్ స్టంట్. ఇందులో ఆమెను తప్పుపట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో శివంగి వర్మ పోస్ట్ చేయగా.. ఈ పోస్ట్ బాగా పాపులర్ అయ్యింది. అయితే చెడు అర్థాలకు దారి తీయకూడదనే ఆలోచనతోనే నేను స్పందించాల్సి వస్తోంది.
క్లారిటీ ఇచ్చిన గోవింద్..
నా వ్యక్తిగత విషయానికి.. వస్తే నేను మరో అమ్మాయితో ప్రేమలో పడడం అనేది నా జీవితంలో జరగదు. ఎందుకంటే నేను నా భార్యను ఎంతగా ఇష్టపడ్డానో నాకే తెలుసు. తనే నా ఊపిరి. ఈ జన్మకు తను మాత్రమే చాలు. ఆమె ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. నా భార్య కోసం నేను దేవుడితోనైనా సరే యుద్ధం చేయడానికి సిద్ధమే” అంటూ భార్యపై ప్రేమ ఒలకబోస్తూ శివంగి వర్మ చేసిన పోస్ట్ కి క్లారిటీ ఇచ్చారు గోవింద్ నామ్ దేవ్. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
గోవింద్ నామ్ దేవ్ కెరియర్..
టెలివిజన్ నటుడిగా మంచి పేరు దక్కించుకున్న ఈయన సినిమాలతో ఊహించని ఇమేజ్ అందుకున్నారు. 1992లో వచ్చిన ‘షోలా ఔర్ షబ్నం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, విలన్ గా ఎన్నో చిత్రాలలో సత్తా చాటారు.నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా 1977 పూర్వ విద్యార్థి కూడా కావడం గమనార్హం. అక్కడ నటుడిగా 13 సంవత్సరలు పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఇక ఈయన సుధా ను వివాహం చేసుకున్నారు. సినిమాలతో పాటు ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈయన తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకొని పలు అవార్డులు కూడా దక్కించుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర కళానికేతన్ ఫిలిం అవార్డుతో పాటు మధ్యప్రదేశ్ రత్న అవార్డు కూడా ఈయన ఖాతాలో వచ్చి చేరింది.