Surakshith Battina : టాలీవుడ్ సినీ హీరో శోభన్ బాబు సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఈయన భౌతికంగా మనమధ్య లేకున్నా కూడా ఆయన సినిమాల తో ప్రేక్షకుల మదిలో నిలిచిన గొప్ప నటుడు. అందుకే సినీ ఇండస్ట్రీ ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇకపోతే సినీ ఇండస్ట్రీ లో హీరోలుగా కొనసాగుతున్న వారందరూ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ శోభన్ బాబు మాత్రం తన వారసులను సినిమాలోకి తీసుకురాలేదు. అయితే వాళ్ళు పలు రంగాల్లో తమ సత్తాని చాటుతూ తండ్రికి తగ్గ కొడుకులు గా పేరు తెచ్చుకున్నారు.. తాజాగా ఆయన మనవడు గిన్నిస్ రికార్డులు చోటు సంపాదించుకున్నాడు.. వైద్య రంగంలో అరుదైన శస్త్ర చికిత్స చేసి రికార్డు బ్రేక్ చేశారు.. అంతేకాదు గిన్నీస్ రికార్డు ను బ్రేక్ చెయ్యడం గమనార్హం.. వివరాల్లోకి వెళితే..
గిన్నీస్ రికార్డు బ్రేక్ చేసిన సురక్షిత్..
టాలీవుడ్ ప్రముఖ నటుడు శోభన్ బాబు మనవడు సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి గిన్నిస్ రికార్డు బ్రేక్ చేశారు. ఈ మధ్య డాక్టర్ సురక్షిత్ చెన్నై లో ‘ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్’ ద్వారా భారీ సిస్ట్ ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తొలగించారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగిన ప్రయోజనం లేకపోవడంతో ఆ మహిళ సురక్షిత్ దగ్గరకు వచ్చారు. అయితే ఆయన అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు.. ఈ ఆపరేషన్ తో గిన్నీస్ రికార్డును బ్రేక్ చేశాడు.
Also Read : జాను డ్యాన్సర్ గా ఎందుకు మారిందో తెలుసా..? ఇన్నిరోజులకు బయటపెట్టిన నిజం..
ఎనిమిది గంటల పాటు సర్జరీ..
తమిళనాడు చెన్నై కి చెందిన ఓ 44 ఏళ్ల మహిళ తన గర్భశయంలో అతి పెద్ద సిస్ట్ ఏర్పడటంతో ఆమె గత కొన్నేళ్లుగా తీవ్రమైన ఆ నొప్పితో బాధపడుతుంది. ఆ నొప్పితో పాటు అనేక అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. ఎన్ని ఆస్పత్రులు సంప్రదించినా.. దానిని తొలగించడం కష్టమని, ఓపెన్ సర్జరీ తప్పా మరో మార్గం లేదని చెప్పారు. ఈ క్రమంలో డాక్టర్ సురక్షిత్ ని సంప్రదించగా.. ఆయన ఎటువంటి సర్జరీ లేకుండా 3డీ ల్యాపరోస్కోపిక్ ద్వారా ఆమె గర్భాశయాన్ని తొలగించారు. అయితే ఈ సర్జరీ చేయడానికి దాదాపు 8 గంటల పాటు ఆయన ఆపరేషన్ థియేటర్లో కష్టపడ్డారు. చివరికి ఆ సర్జరీ సక్సెస్ అయింది. మహిళా ప్రాణాలతో బయటపడింది.. ఇదే కాదు గతంలో ఆయన పది వేలకు పైగా సర్జరీలు చేసి అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు. సురక్షిత్ 2016 చెన్నైలో ఇండిగో ఉమెన్స్ సెంటర్ను స్థాపించారు. ఆ సమయంలోనే ట్రూ 3డీ ల్యాపరోస్కోపిక్ వ్యవస్థ ను ప్రవేశపెట్టారు. ఇలా రోగులను త్వరగా కోలుకునేలా చేశారు. మొత్తానికి తాత పేరు నిలబెట్టిన మనవడుగా చరిత్రలో నిలిచిపోయాడు సురక్షిత్..