Ramcharan Fans: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో “పెద్ది” (Peddi)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులను బుచ్చిబాబు పరుగులు పెట్టిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి.
పెద్దితో మెప్పిస్తారా…
ఇటీవల రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్(Game Changer) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల పాటు సమయం తీసుకున్న చరణ్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను తీసుకురావడమే కాకుండా అభిమానుల ఆశలను నిరాశలుగా మార్చేసింది. దీంతో బుచ్చిబాబు(Bucchibabu) డైరెక్షన్లో రాబోయే పెద్ది సినిమా పైనే అభిమానులు కూడా చాలా ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఏరువాక పౌర్ణమి…
ఈ వీడియోలో రామ్ చరణ్ మాస్ లుక్ లో కనిపిస్తూ క్రికెట్ ఆడిన తీరు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఈ వీడియో చూస్తుంటే రాంచరణ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ అభిమానులు ఏరువాక పౌర్ణమిని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Fans of Global Star @AlwaysRamCharan from Gudikal Village celebrated Yeruvaka Pournima in style, donning the iconic look from his upcoming and highly anticipated film #PEDDI 🔥#GlobalStarRamCharan #PEDDI@BuchiBabuSana @arrahman @MythriOfficial @vriddhicinemas @PeddiMovieOffl pic.twitter.com/J5O9iX0mDn
— TeluguOne (@Theteluguone) June 13, 2025
గుడికల్ గ్రామానికి చెందిన రామ్ చరణ్ అభిమానులు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రామ్ చరణ్ పెద్ది ఐకానిక్ లుక్ లో దర్శనమిస్తూ అదే తీరులో బ్యాటింగ్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ది సినిమా కోసం ఎంతలా అభిమానులు ఎదురుచూస్తున్నారో స్పష్టమవుతుంది. మరి బుచ్చిబాబు చరణ్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తదుపరి సినిమా సుకుమార్ తో చేయబోతున్నారు. దీంతో చరణ్ తదుపరి సినిమాలపై అభిమానులలో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక చరణ్ వరుసగా ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులతో కూడా సినిమాలు చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు మాత్రం వెలువడలేదు.