Big TV Kissik Talks..కిస్సిక్ టాక్స్ (Kissik Talks).. ప్రముఖ ఛానల్ బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఈ షో ఇప్పటికే యూట్యూబ్లో తెగ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎంతోమంది సీనియర్ ఆర్టిస్ట్ లను మొదలుకొని జూనియర్ ఆర్టిస్ట్ లకు వరకూ ఈ షో కి వచ్చి సందడి చేస్తున్నారు. అంతేకాదు ఈ షో చూస్తున్న వీక్షకులు కూడా తమకు నచ్చిన సెలబ్రిటీని ఈ షోకి పిలవాలి అని కామెంట్ రూపంలో తమ అభిప్రాయాలుగా వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ వర్ష (Jabardast Varsha) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. ఇప్పుడు మరింత పాపులారిటీ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు ప్రతి వారం ఒక గెస్ట్ వచ్చి ఈ షోలో సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ వారం కూడా ప్రముఖ నటి ఈ షోకి హాజరయ్యి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంది.
కిస్సిక్ టాక్స్ కి గెస్ట్ గా విచ్చేసిన భాను శ్రీ..
ఆమె ఎవరో కాదు భాను శ్రీ (Bhanu Sri).. ఒకప్పుడు పలు షోలలో యాంకర్ గా పనిచేసిన ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. అక్కడ తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది భాను శ్రీ. ఇదిలా ఉండగా గత కొంతకాలం క్రితం వెండితెరపై కూడా దర్శనమిచ్చిన ఈమె సడన్ గా ఇండస్ట్రీకి దూరమైంది. అనుకోకుండా విదేశాలలో ప్రత్యక్షమై అక్కడి నుంచే పలు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈమె ఫోటోలు చూసిన తర్వాత భాను హైదరాబాదులో కంటే విదేశాలలోనే ఎక్కువగా ఉందే అంటూ ఫాలోవర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ కి చేరుకున్న ఈమె తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసింది. ప్రస్తుతం ఈ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాను శ్రీ తన కెరియర్ గురించి చెప్పుకుంటూ రాజమౌళి వల్లే తన కెరియర్ నాశనమైంది అంటూ హాట్ బాంబు పేల్చింది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే ఇప్పుడు చూద్దాం.
రాజమౌళి వల్లే నా కెరియర్ నాశనం – భాను శ్రీ
ఇంటర్వ్యూలో భాగంగా వర్ష భాను శ్రీని ప్రశ్నిస్తూ.. ఇప్పుడు రాజమౌళి గారు వచ్చి మీతో సినిమా చేయాలని అడిగితే..” మీ సమాధానం ఏంటి?” అని ప్రశ్నించగా.. అంతలోనే భాను..” ఎందుకురా పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేస్తావు” అంటూ కామెంట్ చేసింది. ఇక వెంటనే వర్ష అందుకొని..” ఎందుకు ఆల్రెడీ నువ్వు రాజమౌళితో పని చేశావు కదా భాను..” అని వర్షా ప్రశ్నించగా.. భాను శ్రీ మాట్లాడుతూ..” నిజంగా రాజమౌళి సినిమా చేయడం వల్ల నా లైఫే టర్న్ అయిపోయింది”.అంటూ సీరియస్ గా భాను ఏదో చెప్పబోయింది. సడన్ గా వాయిస్ ని మ్యూట్ చేశారు నిర్వాహకులు. ఇకపోతే రాజమౌళి సినిమా వల్ల ఈమె కెరియర్ కు ఎలాంటి అడ్డంకులు ఏర్పడ్డాయి అనే విషయం తెలియాలి అంటే.. ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ప్రస్తుతం భాను శ్రీ కి సంబంధించిన ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
also read: The Raja Saab Teaser : రాజా సాబ్ టీజర్ లీక్.. నెటిజన్లను తీవ్రంగా హెచ్చరించిన మూవీ టీం!
అసలేం జరిగిందంటే?
ఇకపోతే భాను శ్రీ, రాజమౌళి డైరెక్షన్లో చేసిన సినిమా బాహుబలి (Bahubali). బాహుబలిలో తమన్నా(Tamannaah )కి డూప్ గా భాను శ్రీ నటించింది. ముఖ్యంగా కొన్ని యాక్షన్స్ సన్నివేశాలలోనే కాకుండా ఒక సాంగ్ లో కూడా తమన్నాకి డూప్ గా భాను శ్రీ నటించి.. అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాతో తమన్నాకి భారీ పాపులారిటీ వచ్చింది. కానీ భాను శ్రీ మాట ఎక్కడ వినపడలేదు.దీంతో చాలావరకు ఆమె కెరియర్ కు ఇది ఉపయోగపడలేదని ఆమె బాధ పడుతూ ఎమోషనల్ అయినట్లు సమాచారం.