Horror Movie in OTT : ఓటీటీలోకి వచ్చే సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. డిఫరెంట్ జోనర్ లో వచ్చే సినిమాలపై మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హారర్ సినిమాలలో దెయ్యాల కథల పై వచ్చే మూవీస్ ఎప్పటికి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. హారర్, బోల్డ్ సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులకు అలరిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి బోల్డ్ అండ్ హారర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ పేరేంటి? అదిరిపోయే ట్విస్టులతో మిమ్మల్ని మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. మరి ఈ హారర్ చిత్రాన్ని ఏ ఓటీటీలో చూడొచ్చు? స్టోరీ ఏంటో ఒకసారి లుక్ వేసుకోండి..
స్టోరీ విషయానికొస్తే..
భయంకరమైన హారర్ సినిమా పేరు ది నైట్ హౌస్.. అడవిలో ఓ అందమైన అమ్మాయి నివాసం ఉంటుంది. ఈ మూవీ హీరోయిన్ ఆమెనే.. అయితే ఆమె ఒంటరిగా ఉంటుంది. ఆమెకు కేవలం ఒక ముసలి ఆయన మాత్రమే తోడు ఉంటాడు. అయితే ఆమె భర్తను కోల్పోయి ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు పీడ కలలు ఎక్కువగా వస్తుంటాయి. చనిపోయిన భర్తను ఎప్పుడూ గుర్తు చేసుకుంటున్న హీరోయిన్‌కు.. ఇంట్లో వింత వింత సంఘటనలు ఎదురవుతుంటాయి. నిద్రపోతే చాలు.. కలలో ఏదొక రూపం వచ్చి ఆమెతో మాట్లాడటానికి ట్రై చేస్తుంటుంది. అలాగే అర్ధరాత్రి చప్పుళ్లు, ఉదయాన్నే లేచి చూస్తే అడుగు జాడలు. ఇలా ఆమెకు రోజుకో వింత కనిపిస్తుంది.
అయితే ఒకరోజు ఆమెకు భయం వేసి తన ఫ్రెండ్ ను తోడుగా పిలుస్తుంది. ఆమె మధ్యలో మాయం అయిపోతుంది. అయితే ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది తెలియదు కానీ రోజుకో విధంగా ఆమె భయానికి గురవుతుంది. అనూహ్యంగా ఓ అర్ధరాత్రి హీరోయిన్ బోటులో ఉంటే.. ఆమె ఇంట్లో లైట్స్ ఆన్ అయ్యి ఉంటాయి. అలాగే హీరోయిన్‌కు ఆమె ఇంట్లో ఓ చేతబడి చేసిన బొమ్మ కనిపిస్తుంది. ఇంతకీ ఆ బొమ్మ అక్కడికి ఎలా వచ్చింది. దెయ్యం రూపంలో హీరోయిన్ కలలోకి వచ్చేది ఆమె భర్తా.? లేదా మరెవ్వరైనా వస్తున్నారా? అన్నది తెలియాలంటే ఖచ్చితంగా మూవీని చూసేయ్యాల్సిందే మరి.
Also Read :ఓటీటీలోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చేసిన విజయ్ సేతుపతి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
జియో హాట్ స్టార్ ( Jio Hotstar)..
సాధారణంగా హారర్ సినిమాలను ఎక్కువగా కొన్ని ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేస్తాయి. ఈ భయంకరమైన హారర్ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. సీన్ సీన్‌కో ట్విస్ట్‌తో అలరించే ఈ భయంకర మూవీలో హారర్ సీన్స్‌తో పాటు పలు బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి.. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయ్యండి. ఈ మూవీని ఒంటరిగా మాత్రం చూడకండి..
ఈ ఓటీటీలో హారర్ సినిమాలకు అస్సలు కొదవ లేదు.. ఈ మధ్య కొత్త సస్పెన్స్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.. వచ్చే నెలలో థియేటర్లలోకి రాబోతున్న కొత్త సినిమాల డిజిటల్ హక్కులను జియో సొంతం చేసుకుంది. ఆలస్యం లేకుండా ఒక్క సినిమాను మిస్ అవ్వక్కుండా చూసేయ్యండి.