BigTV English

Guinness World Record : గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్… ఎంత మంది సౌత్ స్టార్స్ ఉన్నారో తెలుసా?

Guinness World Record : గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్… ఎంత మంది సౌత్ స్టార్స్ ఉన్నారో తెలుసా?

Guinness World Record : మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ లో తన పేరును లిఖించుకుని సౌత్ లో ఈ అంత్యంత అరుదైన గౌరవం అందుకున్న నటుడిగా నిలిచారు. 45 ఏళ్ల కెరీర్ లో 156 సినిమాలు,  537 పాటలు,  24 వేల స్టెప్పులతో అలరించిన ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ యాక్టర్ గా ఆయనకు ఈ అరుదైన రికార్డు దక్కింది. ఇదేం చిన్న విషయం కాదు. మరి ఇప్పటిదాకా ఈ ప్రపంచంలోనే అరుదైన రికార్డ్ గిన్నిస్ బుక్ లో తమ పేరును చిరస్థాయిగా లిఖించుకున్న ఇండియన్ సెలబ్రిటీలు ఎవరు? అందులోనూ సౌత్ స్టార్స్ ఎంతమంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.


1. అమితాబ్ బచ్చన్ – 6 రికార్డులు

అత్యధిక చలన చిత్రాల్లో (150 కంటే ఎక్కువ) లీడింగ్ యాక్టర్ గా నటించిన నటుడుగా, అత్యధిక సంఖ్యలో పాటలు (77) పాడిన సినీ నటుడుగా, 50 ఏళ్ళకు పైగా సుధీర్ఘ కెరీర్ సినిమా ఇండస్ట్రిలో ఉన్న నటుడిగా, అత్యధిక అవార్డులు అంటే దాదాపు 145 అవార్డులు గెలుచుకున్న స్టార్ గా అమితాబ్ తన పేరును గిన్నిస్ బుక్ లో సుస్థిరం చేసుకున్నారు.


2. షారూఖ్ ఖాన్ (3 రికార్డులు)

ప్రపంచంలోనే అత్యధిక మంది 1 బిలియన్ కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్న స్టార్ గా,  చెన్నై ఎక్స్ప్రెస్ మూవీతో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఒక రికార్డును, విదేశాల్లో అత్యంత విజయవంతమైన భారతీయ చలనచిత్ర నటుడుగా మరో రికార్డును తన పేరును గిన్నిస్ బుక్ లో ఎక్కించారు షారుక్.

3. సల్మాన్ ఖాన్ (2 రికార్డులు)

వరుసగా 10 సినిమాలతో 100 కోట్లు కొల్లగొట్టిన సల్మాన్ అత్యధికంగా 100 కోట్ల సినిమాలు చేసిన హీరోగా, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం “బజరంగీ భాయిజాన్”తో మరో రికార్డును గిన్నిస్ బుక్ లో క్రియేట్ చేశారు సల్మాన్,

4. రజనీకాంత్ 

100 కంటే ఎక్కువ అభిమాన సంఘాలు ఉన్న భారతీయ చలనచిత్ర నటుడిగా తలైవా రజినీకాంత్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు.

5. అమీర్ ఖాన్ (2 రికార్డులు)

-చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం (“దంగల్”)
-చైనాలో అత్యంత విజయవంతమైన భారతీయ చలనచిత్ర నటుడు

Padma Vibhushan Chiranjeevi Sets Guinness World Record for Dance Moves -  NTV ENGLISH

గిన్నిస్ బుక్ రికార్డ్ లో ఉన్న దక్షిణ భారత నటులు

1. కమల్ హాసన్ (4 రికార్డులు)
– అత్యధిక అవార్డులు గెలుచుకున్న భారతీయ నటుడు (155)
– అత్యధిక భాషల్లోకి డబ్ చేయబడిన సినిమాలు (18)
– అత్యధిక సంఖ్యలో చలన చిత్రాలలో నటించిన స్టార్
– సినీ నటుడిగా సుదీర్ఘ కెరీర్ (60+ సంవత్సరాలు)

2. రజనీకాంత్ 
– భారతీయ చలనచిత్ర నటుడి కోసం అత్యధిక అభిమానుల సంఘాలు (100 కంటే ఎక్కువ)

3. చిరంజీవి (2 రికార్డ్స్)
– ఒక భారతీయ నటుడు ప్రధాన పాత్రలో నటించిన అత్యధిక చిత్రాలు (150+), తాజాగా 537 పాటల్లో,  24 వేల స్టెప్పుల కారణంగా చిరు మరోసారి గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు.

బాహుబలి 

ఈ లిస్ట్ లో బాహుబలి కూడా ఉంది. రాజమౌళి రూపొందించిన బాహుబలి: ది బిగినింగ్ 50,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో అతిపెద్ద పోస్టర్‌ను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. కాగా పి సుశీల, బ్రహ్మానందం, నిర్మాత రామానాయుడు, గజల్ శ్రీనివాస్, అలనాటి నటి విజయ నిర్మల కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.

దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్, మధుబాల, లలితా పవార్, పైడి జైరాజ్, కహో నా… ప్యార్ హై మూవీ, నటుడు జగదీష్ రాజ్, కపూర్ ఫ్యామిలీ, సింగర్ కుమార్ సాను, గాయని ఆశా భోంస్లే, దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఈ గిన్నిస్ బుక్ లో తమ పేరును లిఖించుకున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×