E-Paper
Advertisement

Guntur Kaaram : తాత రేంజ్‌కి మహేష్ బాబుని దిగజార్చేశారంటూ ట్రోలింగ్..!

Guntur Kaaram : తాత రేంజ్‌కి మహేష్ బాబుని దిగజార్చేశారంటూ ట్రోలింగ్..!
Advertisement

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ‘గుంటూరు కారం’ నుంచి రీసెంట్‌గా రిలీజైన ఓ సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే ఈ ప్రోమోపై మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే మరికొంత మంది మాత్రం ఈ సాంగ్ ప్రోమోపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే మరి ఎందుకు అంతలా ట్రోల్ చేస్తున్నారు?.. అనే విషయానికొస్తే..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడవసారి రాబోతుంది. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఇక రీసెంట్‌గా రిలీజైన ఓ సాంగ్‌కి మాత్రం వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే ఈ సాంగ్‌లో మాహేశ్, శ్రీలీల స్టెప్పులు ప్రేక్షకులకు ఫుల్ స్టఫ్ ఇచ్చాయనే చెప్పాలి.

Advertisement

ఇక ఈ పార్టీ పెప్పి మాస్ సాంగ్‌తో ఈసారి న్యూ ఇయర్ మోత మోగిపోవడం పక్కా అని తేలిపోయింది. ఈ సాంగ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు మాస్ స్టెప్పులతో ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ కొంతమంది మాత్రం ఈ సాంగ్‌తో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘కుర్చీ మడత పెట్టి’ తాత రేంజ్‌కి మహేశ్‌ని దిగజార్చేశారు అంటూ మండిపడుతున్నారు.

మహేష్ బాబుకు ఉండే క్లాస్ ఇమేజ్‌కి, ఆయన ఇలాంటి పాటలో డాన్స్ చేస్తూ కనిపించడం చాలా దారుణంగా ఉంది అంటూ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెగిటివ్ రెస్పాన్స్ సినిమాకి ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక చిత్రబృందం కూడా ఈ నెగిటివ్‌ని పాజిటివ్ గానే తీసుకుంటుంది. ఈ ట్రోలింగ్ వల్ల వస్తున్న ఫ్రీ పబ్లిసిటీతో టీం హ్యాపీగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఫుల్ సాంగ్ విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×