BigTV English

CM Revanthreddy : పొలిటికల్ లయన్ రేవంత్ రెడ్డి.. సుప్రియా సూలె ప్రశంసలు..

CM Revanthreddy : రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి సింహం అంటూ ప్రశంసలతో ముంచెత్తారు NCP అధినేత శరద్ పవార్ కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలె. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ ను జైల్లో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారామె. జైలు నుంచి వచ్చారు.. కొట్లాడారు.. సీఎం అయ్యారంటూ రేవంత్‌రెడ్డి పోరాట పటిమను తన పార్టీ కార్యకర్తలకు గుర్తు చేశారు. ఎన్సీపీ కూడా అధికారంలోకి రావాలంటే.. రేవంత్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని సుప్రియా సూలె సూచించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతపదేళ్లుగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. తెలంగాణలో రాష్ట్రాన్ని ఇచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. 2014, 2018 ఎన్నికల్లో ఓటములు చవిచూసింది. పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ ను మరింత బలహీనం చేశాయి. చాలా మంది ఎమ్మెల్యేలు అప్పటి అధికార బీఆర్ఎస్ చేరిపోయారు. ఇది రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యేనాటికి కాంగ్రెస్ పరిస్థితి. ఆయన సారథ్యంలోనూ ఆటుపోట్లు ఎదురయ్యాయి. మునుగోడు ఉపఎన్నికలో మూడోస్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. సిట్టింగ్ సీటు కోల్పోయింది. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరూ అంచనా వేయలేదు.

కాంగ్రెస్ కు ఉపఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైనా రేవంత్ రెడ్డి పట్టుదలతో పార్టీని నడిపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక కసరత్తు చేశారు. నేతల మధ్య సమన్వయం తీసుకొచ్చారు. తాను నాలుగుమొట్లు కిందకు దిగారు. తన నాయకత్వాన్ని వ్యతిరేకించిన నేతలను కలుపుకున్నారు. పార్టీని వీడిన నేతలను తిరిగి రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, జి. వివేక్ లాంటి నేతలను పార్టీకి చేర్చుకున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ రెడ్డి ఎండగట్టారు. కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందో స్పష్టం చెప్పారు. 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ఓటర్లలో కాంగ్రెస్ పై నమ్మకాన్ని కలిగించారు. ఇలా ఎన్నికల యుద్ధంలో తనదైన వ్యూహాలతో ముందుకెళ్లి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు . అందుకే రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ సుప్రియా సూలె NCP నేతలకు సూచించారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×