BigTV English

Saveera Parkash | పాకిస్తాన్ జనరల్ ఎలెక్షన్స్‌లో తొలి హిందూ మహిళ.. నామినేషన్ వేసిన సవీరా పర్కాష్!

Saveera Parkash | భారత్ దాయాది పాకిస్తాన్‌లో ఫిబ్రవరి నెలలో జెనెరల్ ఎలక్షన్స్ జరుగబోతున్నాయి. అయితే పాకిస్తాన్‌లో తొలిసారిగా ఒక హిందూ మహిళ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. ఆమె పేరు సవీరా పర్కాష్. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాకు చెందిన సవీరా వృత్తి రీత్యా ఓ డాక్టర్.

ఆమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(PPP)తరపున ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో 55 ఏళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఈ 55 ఏళ్లలో ఒక మహిళ అందులోనూ ఒక హిందూ మహిళ పోటీ చేయడం ఇదే తొలిసారి. సవీరా పర్కాష్ తండ్రి డాక్టర్ ఓం పర్కాష్ గత 35 ఏళ్లుగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో సభ్యునిగా ఉన్నారు.

సవీరా పర్కాష్ పాకిస్తాన్‌లోని ఎబొట్టాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్ డిగ్రీ పొందారు. ఆమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మహిళా విభాగంలో ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలని స్వయంగా అగ్రనాయకులే ఆమెకు ఆదేశించారని సవీరా తెలిపారు. ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే పేద, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆమె అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహణ ఏమాత్రం సరిగాలేదని ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సవీరా తెలిపారు.

Saveera Parkash, First Hindu woman, contest, Pakistan elections, Khaibar Pakhtunkhwa, Pakistan Peoples Party,

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×