E-Paper
Advertisement

GV Prakash Kumar Divorce: మా విడాకులకు కారణం మీకు తెలుసా.. పరువు పోగొట్టుకోకండి: జీవీ ప్రకాష్ వార్నింగ్!

GV Prakash Kumar Divorce: మా విడాకులకు కారణం మీకు తెలుసా.. పరువు పోగొట్టుకోకండి: జీవీ ప్రకాష్ వార్నింగ్!
Advertisement

GV Prakash Kumar Serious on Trollers: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు హీరో అయిన జీవీ ప్రకాష్ కుమార్ తన భార్యతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. తమ 11 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపాడు. ప్రకాష్, గాయని సైంధవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇద్దరు 11 ఏళ్ళు కలిసి ఉన్నాకా కొన్ని విబేధాల వలన విడిపోతున్నట్లు ప్రకటించారు.

“చాలా ఆలోచించిన తర్వాత సైంధవి, నేను 11 ఏళ్ల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నాము. వివాహం, మన మానసిక ప్రశాంతత కోసం, మా ఇద్దరి లైఫ్‌లు మెరుగవటం కోసమే పరస్పర గౌరవంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.అందువల్ల ఇలాంటి సమయంలో మీడియా మిత్రులు, అభిమానులను దయతో అడుగుతున్నాము..మా నిర్ణయాన్ని అర్థం చేసుకొని గౌరవించాలని కోరుతున్నాము. మేము విడిపోతున్నాము. ఇది కరెక్ట్ నిర్ణయమే అని మేము నమ్ముతున్నాము. ఇది ఒకరికొకరు ఉత్తమ నిర్ణయం. మీ అవగాహన, ఈ కష్ట సమయంలో మద్దతు చాలా అవసరం” అంటూ రాసుకొచ్చాడు.

Advertisement

ఇక దీంతో ప్రకాష్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. సెలబ్రిటీలు అందరూ ఇంతే. పెళ్లి మీద అవగాహన ఉండదు.. ఈజీగా తీసుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విమర్శలపై జీవీ స్పందించాడు. “ఒకరిద్దరు వ్యక్తులపై అవగాహన లేకుండా, తగిన వివరాలతో బహిరంగంగా చర్చించుకోవడం విచారకరం, కేవలం పేరు ప్రఖ్యాతులున్నందుకే వ్యక్తిగత జీవితంలోకి చొరబడి నాణ్యమైన విమర్శలు చేయడం ఆమోదయోగ్యం కాదు. తమ ఊహలను మాటల ద్వారా వ్యక్తీకరించడం మరియు సోషల్ మీడియాలో వ్యక్తీకరించడం “ఎవరో వ్యక్తి” జీవితంపై ప్రభావం చూపుతుందని గ్రహించని తమిళులు తమ పరువు పోగొట్టుకున్నారా..?

Also Read: Serial Actress Sireesha: విడాకులు ప్రకటించిన ‘చెల్లెలి కాపురం’ సీరియల్ హీరోయిన్..

Advertisement

పరస్పర అంగీకారంతో విడిపోవడానికి గల నేపథ్యం, ​​కారణాలు నాతో సన్నిహితంగా ఉండే స్నేహితులు, బంధువులకు తెలుస్తాయి. అందరినీ సంప్రదించిన తర్వాతే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. మాకు పేరు తెచ్చే హక్కు లేదా నా వ్యక్తిగత జీవితం పట్ల వారి ప్రేమకు వ్యక్తీకరణగా పాల్గొన్న వారి హృదయాలను గాయపరుస్తుందని తెలియజేయడానికి నేను దీన్ని పోస్ట్ చేస్తున్నాను. ప్రతి వ్యక్తి యొక్క న్యాయమైన భావాన్ని గౌరవించండి. మీ ప్రేమ మరియు మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×