Alekhya Chitti Pickles : అలేఖ్య చిట్టి పికిల్స్ .. బిజినెస్ పెట్టిన 11 నెలల్లోనే మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాల బాట పట్టారు ఈ సిస్టర్స్. ఇక అంతా బాగానే ఉన్నా సడన్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో ఒకరైన అలేఖ్య చేసిన పనికి పూర్తిస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. అటు సోషల్ మీడియాలో నెగిటివిటీ కూడా భారీగా పెరిగిపోయింది.అసలు విషయంలోకి వెళ్తే.. సదరు కస్టమర్ ధరలు ఎందుకు ఇంత అధికంగా ఉన్నాయి అని ప్రశ్నించినందుకు.. అలేఖ్య అతడి వ్యక్తిగత విషయాలను బయటకు తీస్తూ అత్యంత దారుణంగా మాటలు మాట్లాడింది. ఇక దీంతో హర్ట్ అయిన సదరు కస్టమర్ అలేఖ్య మాట్లాడిన వాట్సప్ స్క్రీన్ షాట్ తో పాటు వాయిస్ ఆడియో ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అలేఖ్య చిట్టి సిస్టర్స్ పై నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.
అలేఖ్య చిట్టి సిస్టర్స్ పై భారీ నెగెటివిటీ..
అంతేకాదు అలేఖ్య మాట్లాడిన ఆడియోని మీమ్స్ రూపంలో తెగ వైరల్ చేసారు. పైగా కొంతమంది హీరోలు కూడా తమ సినిమా ప్రమోషన్స్ లో ఈ ఆడియో వాడుకున్న విషయం తెలిసిందే..అలా ఒక్క నైట్ లో భారీ నెగెటివిటీని సొంతం చేసుకున్నారు అలేఖ్య సిస్టర్స్. దీంతో అలేఖ్య సిస్టర్స్ రమ్య, సుమ తమ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. అయినా సరే అలేఖ్యపై నెగిటివిటీ పెరుగుతున్న నేపథ్యంలో అలేఖ్య డిప్రెషన్ లోకి వెళ్లిపోయి, ఆఖరికి ఐసీయూలో కూడా చేరింది. ఇక ఈ మధ్యనే తేరుకొని బయటకొచ్చిన ఈమె.. తొలిసారి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ ముందుకు వచ్చి అందరికీ క్షమాపణలు చెప్పింది. తప్పు నాదే అని అయితే ఇప్పట్లో బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలు లేవు అని తెలిపింది. ఇక దీంతో పోనీలే పాపం అని కొంతమంది వీరికి సపోర్ట్ చేశారు.
also read:NTR Vs Balakrishna: మళ్లీ మొదలైన వార్.. కళ్యాణ్ రామ్ ఆరాటం.. ఎన్టీఆర్ దూరం.. అసలేం జరిగిందంటే?
మళ్లీ రెచ్చిపోయిన అలేఖ్య.. వీడియో వైరల్!
అయితే ఇప్పుడు తాజాగా అలేఖ్య షేర్ చేసిన మరొక వీడియో చూసి అసలు వీళ్ళని ఎందుకు పాపం అన్నారు.. వీళ్లకు గోరోజనం ఇంకా తగ్గలేదు.. అంటూ ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. అలేఖ్య తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో షేర్ చేసింది..అందులో అలేఖ్య మాట్లాడుతూ.. “పుట్టినప్పటి నుండి ఈ భూ ప్రపంచంలో మీరు అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటే తిన్నారా? అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటే రివ్యూ చేశారా? ఇప్పుడు ఈ పాయింట్స్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారేమో.. ఆల్రెడీ చెప్పేసారు కదా అలేఖ్య చిట్టి పికెల్స్ బాగున్నాయి కానీ ధరలే ఎక్కువగా ఉన్నాయని.. అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ కొంటున్నారు బ్రో మీరు. మా ఇంట్లో తిడుతున్నారు.. మా హస్బెండ్ కొడుతున్నారు అని మాతో ఎందుకు చెప్పడం.. అలాంటప్పుడు కొనకండి.. మేము ఏమైనా మీ డబ్బులు లాగేసుకుంటున్నామా? మీకు ఆ ధరలు తెలిసే కదా.. మీరు కొనుగోలు చేసింది. మా పికిల్స్ కొనకండి.. కొన్న తర్వాత మీ ఇంట్లో తిట్లు తినకండి. మీరు ధరలు తెలిసి మీకు నచ్చిందే మీరు కొంటున్నారు. అంతే తప్ప నేను మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు.తీరా కొనుగోలు చేసిన తర్వాత ఇలాంటి మాటలు అనవసరం” అంటూ అలేఖ్య వదిలిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు దీనిని చూసిన చాలా మంది వీళ్ళకి ఇంకా పొగరు తగ్గలేదు భయ్యా.. నీకు ఉన్నంత బలుపు మన ఏరియాలో ఎవరికీ ఉండదు చిట్టి పికెల్స్ అక్క ఇంకెవరైనా వీళ్ళని పాపం రా.. వాళ్ళని వదిలేయండి.. వాళ్ళ బతుకు బతకనివ్వండి అంటే వాళ్ల మొహాన ఈ ఒక్క వీడియో కొట్టండి అంటూ మీమ్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఇంత జరిగినా వీరు మళ్ళి ఇలాంటి కామెంట్లు చేయడంతో అటు నెటిజన్స్ కూడా పూర్తిస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.
Veellaki inka thaggaledu bhayya !!
Neeku unnantha balupu mana area lo evariki undadhu Chitti fickles akka 😭😭
Inka evaraina veellani papam ra vallani vadileyyandi,valla bathuku bathakanivvandi ante valla mohana e video kottandi #alekhyachittipickles pic.twitter.com/2C6cCVwFPi
— Vamc Krishna (@lyf_a_zindagi) June 9, 2025