E-Paper
Advertisement

Hansika: గృహ హింస కేసుపై హైకోర్టుకు హన్సిక.. కేసు కొట్టేయాలని విజ్ఞప్తి..

Hansika: గృహ హింస కేసుపై హైకోర్టుకు హన్సిక.. కేసు కొట్టేయాలని విజ్ఞప్తి..
Advertisement

Hansika: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి బిజీగా మారిన హీరోయిన్లలో ఒకరు హన్సిక మోత్వానీ.. ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలో నటించిన ఈ అమ్మడు. ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈమధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో అటు బాలీవుడ్ లో తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవలే ఈమె పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఒకవైపు సినిమాలు తో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇదిలా ఉండదా తాజాగా ఈమె, బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అసలేం జరిగిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

Also Read: మీనా ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Advertisement

హన్సిక పై కేసు.. 

హీరోయిన్ హన్సికా మోత్వానీ, ఆమె తల్లి జ్యోతి మోత్వానీ బాంబే హైకోర్టును ఆశ్రయించి.. తమపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలని కోరారు. వారిద్దరిపై హాన్సిక సోదరుడి భార్య ముస్కాన్ జేమ్స్ ఐపీసీ సెక్షన్ 498 ఏ కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే.. హన్సిక, జ్యోతి వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సారంగ్‌ కోత్వాల్‌, జస్టిస్‌ మోదక్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ముస్కాన్ జేమ్స్‌కు నోటీసులు జారీ చేసింది.. ఈ కేసు పై హైకోర్టు జూలై లో విచారణ జరిపనుందని తెలుస్తుంది. ప్రశాంత్ మోత్వానీని 2020 డిసెంబర్‌ లో ముస్కాన్ జేమ్స్ అనే టీవీ నటి వివాహం చేసుకున్నారు. ఈ జంట 2022 డిసెంబర్‌లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ముస్కాన్ అందరి పై గృహ హింస కేసు పెట్టింది. అయితే హన్సిక, జ్యోతికి ముంబై సెషన్స్ కోర్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో ముందస్తు బెయిల్ వచ్చింది. ఇప్పుడు వారిద్దరు కలిసి తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని హైకోర్టులో ఫిటిషన్ వేశారు.

Advertisement

ఈ కేసు పై హన్సిక ఏమన్నారంటే..? 

ఆమె వేధింపులు తట్టుకోలేకే విడాకులు తీసుకోవాలని హన్సిక సోదరుడు భావించారు. తనపై ప్రతీకారం తీర్చుకునేందుకే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని హన్సిక అన్నారు. తన సోదరుడు, జేమ్స్ పెళ్లి కోసం తాను రూ.27 లక్షలు ఖర్చు చేశానని, తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనపై కేసు పెట్టారని చెప్పారు. వారి పెళ్లి కోసం వెడ్డింగ్ ప్లానర్ కు నేను ఆ డబ్బులు చెల్లించానని దాన్ని తిరిగి నాకు ఎప్పుడు ఇవ్వాలని కోరినందుకు నాపై గృహహింస కేసులు పెట్టారని హన్సిక పిటిషన్ లో పేర్కొన్నారు..

ఇంతవరకు ఆ డబ్బును తన సోదరుడుగానీ, జేమ్స్‌ కానీ ఇవ్వలేదని తెలిపారు. అంతేకాదు చెడు ఉద్దేశాలతో కేసు పెట్టారని చెప్పారు. కుటుంబంలోని విభేదాల కారణంగా తనపై ఆరోపణలు ప్రారంభమయ్యాయని, దీన్ని తీవ్రమైన నేరంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.. ఇటువంటి కేసులను దయచేసి కొట్టుకాలని కోర్టుకు హన్సిక విజ్ఞప్తి చేసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి…

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×