OTT Movie : హారర్ సినిమాలు ప్రేక్షకులను భయపెట్టడానికి రకరకాల కథలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఓటీటీ లో వీటిని ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ హారర్ మూవీలో, ఇండియన్ ఆధ్యాత్మికత ఉంటుంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది అదర్ సైడ్ ఆఫ్ ది డోర్’ (The Other Side of the Door). 2016 లో వచ్చిన ఈ మూవీకి జోహన్నెస్ రాబర్ట్స్ డైరెక్ట్ చేశారు. ఇందులో సారా వేన్ కల్లీస్, జెరెమీ సిస్టో, జేవియర్ బోటెట్, సోఫియా రోసిన్స్కీ నటించారు. ఈ సినిమా కథ ఒక తల్లి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కొడుకు మరణం తర్వాత దు:ఖంలో మునిగిపోతుంది. అతన్ని మళ్లీ చూడటానికి ఒక పురాతన ఆచారాన్ని ఉపయోగిస్తుంది. కానీ దాని ఫలితంగా భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
మరియా, మైఖేల్ అనే ఒక అమెరికన్ జంట ఇండియాలో నివసిస్తుంటారు. వారికి ఒలివర్ అనే కొడుకు, లూసీ అనే కూతురు ఉంటారు. ఒక కారు ప్రమాదంలో ఒలివర్ మరణిస్తాడు. దీని కారణంగా మరియా తీవ్రమైన దు:ఖంలోకి మునిగిపోతుంది. అతన్ని కోల్పోయిన బాధను మరియా ఏమాత్రం భరించలేకపోతుంది. వారి ఇంటి పనిమనిషి పికి మరియాకు ఒక పురాతన ఆలయం గురించి చెబుతుంది. అక్కడ ఒక విచిత్రమైన ఆచారం ద్వారా మరణించిన వారితో మాట్లాడవచ్చు. ఈ ఆచారంలో ఒక నియమం ఉంటుంది. ఆలయంలోని తలుపు వద్ద మరణించిన వారి బూడిదను చల్లి, వారి ఆత్మతో మాట్లాడవచ్చు, కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఆ తలుపును తెరవకూడదు. మరియా ఈ ఆచారాన్ని పాటించడానికి ఆలయానికి వెళ్తుంది. అక్కడ ఒలివర్ గొంతును వింటుంది. భావోద్వేగంతో కొట్టుకుపోయిన ఆమె నియమాన్ని ఉల్లంఘించి తలుపును తెరుస్తుంది.
ఈ చర్య వల్ల ఆమె ఒలివర్ ఆత్మను తిరిగి భూ ప్రపంచంలోకి తీసుకొస్తుంది. కానీ అది ఇకపై ఆమె కొడుకు గా కాకుండా, ఒక చెడు శక్తిగా మారుతుంది. ఆ తర్వాత, వారి ఇంట్లో వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఒలివర్ ఆత్మ లూసీని భయపెడుతుంది. మరోవైపు మరియాను కూడా వెంటాడుతుంది. ఈ పరిస్థితిని సరిచేయడానికి మరియా స్థానిక అఘోరాల సహాయం తీసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ చెడు శక్తి ఇప్పటికే చాలా బలంగా మారిపోతుంది. చివరికి, మరియా తన కుటుంబాన్ని కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేయాల్సి వస్తుంది. చివరికి ఈ ప్రమాదం నుంచి ఆమె ఎలా బయట పడుతుందనేది ఈ హారర్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక నమ్మకాలను హారర్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి తెరకెక్కించారు.