మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళను చంపి 8 నెలలుగా ఫ్రిజ్ లో దాచిన ఘటన దేవాస్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది. బృందావన్ ధామ్ లోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు గది తాళాలు పగులగొట్టారు. డోర్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూడగా, ప్రిజ్ లో ఓ మహిళ శవం కనిపించడంతో షాక్ అయ్యారు. డెడ్ బాడీ చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వెలుగు చూసిన కొద్దిసేపట్లోనే పోలీసులు కేసును ఛేదించారు.
ఇంటి ఓనర్ ను విచారణ చేయడంతో అసలు విషయం బయటకు..
మహిళ డెడ్ బాడీ దొరికిన ఇంటి ఓనర్ ధీరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఆయన కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఇంటిని 2023 జులైలో సంజయ్ అనే వ్యక్తికి రెంట్ కు ఇచ్చినట్లు తెలిపారు. 2024 జూన్ లో ఇల్లు ఖాళీ చేశాడు. కానీ, ఓ గదిలో ఫ్రిజ్ సహా కొన్ని వస్తువులను వదిలేశాడు. ఇవన్నీ మాస్టర్ బెడ్ రూమ్ లో పెట్టాడు. ఈ రూమ్ ను తర్వాత ఖాళీ చేస్తానని ఓనర్ కు చెప్పాడు. కానీ, ఖాళీ చేయలేదు. సంజయ్ ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు.
సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు
రీసెంట్ గా ప్రస్తుతం ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి, మాస్టర్ బెడ్రూమ్ ఓపెన్ చేయాలని కోరాడు. ఓపెన్ చేశారు. కానీ, సంజయ్ వస్తువులు ఉండటంతో మళ్లీ తాళం వేశారు. కానీ, కరెంట్ సరఫరా నిలిపివేశాడు. దీంతో ఫ్రిజ్ పని చేయడం మానేసింది. ఈ నేపథ్యంలో ఫ్రిజ్ నుంచి దుర్వాసన రావడం మొదలయ్యింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులుకు చెప్పండంతో అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే పోలీసులు సంజయ్ ని అరెస్టు చేశారు.
Read Also: గర్భవతి అని తెలిసిన 4 గంటల్లోనే బిడ్డకు జననం, అలా ఎలా?
మహిళను ఎందుకు చంపాడంటే?
మహిళ హత్యకు గల కారణాలపై పోలీసులు సంజయ్ ని విచారించడంతో పలు విషయాలు బయటకు వచ్చాయి. సంజయ్ గత ఐదు ఏండ్లుగా ప్రతిభ అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. అయితే, కొంతకాలం గర్వాత ప్రతిభ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. రోజు రోజుకు ఆమె ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా తనను వదిలించుకోవాలి అనుకున్నాడు. తన ఫ్రెండ్ వినోద్ తో కలిసి మార్చి 2024లో హత్య చేశాడు. ఆ మృతదేహాన్ని చేతులు, కాళ్లు కట్టేసి ఫ్రిజ్ లో దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సంజయ్ ని పోలీసులు అరెస్టు చేయగా, అతడి ఫ్రెండ్ వినోద్ ఇప్పటికే ఓ కేసులో రాజస్థాన్ జైలులో ఉన్నాయి. కాగా, సంజయ్ కి గతంలోనే పెళ్లి కాగా, వ్యవసాయ కూలీగా పని చేసే వాడని పోలీసులు తెలిపారు.
Read Also: స్టవ్ మీద కూర పెట్టి నిద్రపోయారు.. గాల్లో కలిసిపోయిన ప్రాణాలు!