SBI Jobs: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 150
ఇందులో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. ఐఐబీఎఫ్ ద్వారా ఫోరెక్స్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ప్రోబిషన్ పీరియడ్: ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుకు ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది.
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 2025 జనవరి 3 నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
అప్లై చేయడానికి చివరి తేదీ: 2025 జనవరి 23 తేది లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ విధానం: ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
మినిమమ్ ఏజ్ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 23 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.
మాక్జిమమ్ ఏజ్ : గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు లోపు ఉండాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ చేసి అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
ఫీజు : జనరల్ / OBC/ EWS అభ్యర్థులకు రూ.750 ఉంటుంది. (SC, ST, PwBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
పోస్టింగ్ ఇచ్చే ప్రదేశం : ఈ పోస్టులకి ఎంపికైన వారికి హైదరాబాద్ మరియు కోల్ కత్తాలో పోస్టింగ్ ఇస్తారు.
Also Read: NLC Executive Trainee Jobs: NLC ఇండియా లిమిటెడ్‌లో జాబ్స్.. ఇంకా మూడు రోజులే ఛాన్స్
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.