BigTV English

Hanuman: ఓటీటీ కంటే ముందే టీవీలోకి ‘హనుమాన్’.. కన్ఫర్మ్ చేసిన ప్రశాంత్ వర్మ.. ఏ ఛానల్‌లో తెలుసా

Hanuman: ఓటీటీ కంటే ముందే టీవీలోకి ‘హనుమాన్’.. కన్ఫర్మ్ చేసిన ప్రశాంత్ వర్మ.. ఏ ఛానల్‌లో తెలుసా


Hanuman movie update(Today tollywood news): క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన హనుమాన్ మూవీ అద్భుతమైన ఘన విజయాన్ని అందుకుంది.

ఆ సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా.. వాటన్నింటిని వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్‌ అయింది.


అయితే కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.330 కోట్లకి పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది.

READ MORE: మొదటిగా అసహ్యించుకున్నాను.. ఆ తర్వాత మంచే జరిగింది అనుకున్నా: సమంత

ఇక ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా హనుమాన్ తన హవా చూపించింది. అక్కడ కూడా భారీ వసూళ్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హనుమాన్‌కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

దాదాపు నెల రోజుల పాటు ట్విట్టర్‌లో హనుమాన్ మూవీ గురించే టాక్. ఇక థియేటర్లలో బ్లాక్ బస్టర్‌ హిట్‌తో దుమ్ము దులిపేసిన ‘హనుమాన్‌’ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ మూవీతో పాటు సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ మూవీలు ఆల్రెడీ ఓటీటీలో సందడి చేశాయి. అందువల్ల ఈ సినిమా ఒక్కటే స్ట్రీమింగ్ రావాల్సి ఉంది. దీనికోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అలా ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్.

READ MORE: లుక్ ఏమో బిచ్చగాడిలా.. టైటిల్ ఏమో ‘కుబేర’.. ఎక్కడో తేడా కొడుతుంది..

ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ కంటే ముందుగానే టీవీలో ప్రసారం కావడానికి రెడీ అయిపోయింది. మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ ఛానల్‌, జియో సినిమాలో కేవలం హిందీలో హనుమాన్ మూవీ టెలికాస్ట్‌ కానుంది.

ఇందుకు సంబంధించిన అప్డేట్‌ను కలర్స్‌ సినీప్లెక్స్‌ సంస్థ తమ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఓటీటీలోకి వస్తుందనుకున్న సినిమా ఇప్పుడు టీవీల్లోకి రానుందని తెలియడంతో చాలామంది ఫీలవుతున్నారు. కాగా తెలుగు వెర్షన్ మాత్రం ఎప్పుడు, ఎందులో రిలీజ్ చేస్తారో ఇంకా వెల్లడించలేదు. దీనికోసం ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ మూవీని మొదటిగా మార్చి 2 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారంటూ ప్రచారం సాగింది. ఆ తర్వాత మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలవుతుందంటూ టాక్ వచ్చింది. కానీ ఇప్పటికీ ఈ మూవీ తెలుగు వెర్షన్‌పై అప్డేట్ రాకపోవడంతో ప్రేక్షకాభిమానులు నిరాశచెందుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×