BigTV English
Advertisement

Parachute Fell on Civilians : ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై పడిన పారాచూట్.. ఐదుగురు మృతి

Parachute Fell on Civilians : ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై పడిన పారాచూట్.. ఐదుగురు మృతి

gaza parachute incident


Humanitarian Airdrops Killed Civilians in Gaza(Telugu breaking news today): గతేడాది అక్టోబర్ లో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఎంతో మంది అసువులు బాసారు. నిలువ నీడ లేక, కడుపు నింపే తిండి లేక గాజా పౌరులు నానా అవస్థలూ పడుతున్నారు. అక్కడి వారిని ఆదుకునేందుకు వివిధ దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి రిలీఫ్ ప్యాకేజీలను పంపిస్తుంది. ఇందుకు పారాచూట్ లను వినియోగిస్తుంది. ఆ పారాచూటే ఐదుగురి పాలిట మరణశాసనమైంది.

పారాచూట్ ద్వారా ప్యాకేజీని గాజాకు పంపగా.. అక్కడ ఆహారం కోసం ఎదురుచూస్తున్న పౌరులపై అకస్మాత్తుగా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఉత్తర గాజాలోని శరణార్థుల శిబిరంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Read More : ప్రేమ కోసం రాజసాన్నే వదులుకున్న రాజకుమారి.. సినిమా కథను తలపించే లవ్ స్టోరీ!

మరోవైపు గాజా ప్రభుత్వ మీడియా ఈ ఘటనపై స్పందించింది. ఎయిర్ డ్రాప్ లు పనికిరానివిగా ఉన్నాయని తెలిపింది. ఈ ఎయిర్ డ్రాప్ లు కేవలం ప్రచారం కోసమే ఉన్నాయని, మానవతా సేవకు ఉపయోగపడవని వ్యాఖ్యానించింది. ఇలా ఎయిర్ డ్రాప్ ల ద్వారా కాకుండా భూ సరిహద్దు ద్వారా ఆహారం, సామాగ్రిని అందించాలని, అప్పుడు పౌరుల ప్రాణాలకు ముప్పు ఉండదని వెల్లడించింది.

కాగా.. గాజా పౌరుల ప్రాణాలను తీసిన ఎయిర్ డ్రాప్ ను అమెరికా పంపిందేనని కొన్ని నివేదికలు రాగా.. దానిని అమెరికా తీవ్రంగా ఖండించింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ దీనిపై X వేదికగా స్పందించింది. గాజాలో ఎయిర్ డ్రాప్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపింది. అక్కడ పలు ప్రాంతాలకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ జనవరి 23 నుంచి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి.

పదిరోజుల క్రితమే ఆకలి తాళలేక ఆహార పొట్లాల కోసం ఎగబడిన గాజా వాసులపై ఇజ్రాయెల్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో వందల మంది మరణించడం యావత్ ప్రపంచాన్నే కలచివేసింది. మార్చి5న ఒక్కరోజే 86 మంది పాలస్తీనియన్లు మరణించారు.

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×