BigTV English

Samantha: మొదటిగా అసహ్యించుకున్నాను.. ఆ తర్వాత మంచే జరిగింది అనుకున్నా: సమంత

Samantha: మొదటిగా అసహ్యించుకున్నాను.. ఆ తర్వాత మంచే జరిగింది అనుకున్నా: సమంత

Samantha latest news


Samantha latest news(Tollywood celebrity news): టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్టార్ స్టేటస్ ఏర్పరచుకుంది. అందం, నటన పరంగా ప్రేక్షకాభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక సినిమాలలో తన జోరు కనబరుస్తున్న సమయంలో మయోసైటిస్ అనే వ్యాధి భారిన పడింది.

2022లో సమంతకు అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. అందువల్ల ఆ వ్యాధికి చికిత్స పొందేందుకు గతేడాది ఈ బ్యూటీ విరామం తీసుకుంది. ఇక ఇప్పుడు సమంత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన విరామం గురించి సామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


సమంతా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మయోసైటిస్ కారణంగా విశ్రాంతి తీసుకోవడం తనకు చాలా కష్టమైన నిర్ణయమని వెల్లడించింది. అయితే ఆ తరువాత తన ఆలోచన మారిపోయిందని.. ఆ నిర్ణయం వల్ల తనకు మంచి ప్రయోజనాలు లభించాయని తెలిపింది. ‘‘నన్ను నేను అసహ్యించుకోవడం మొదలుపెట్టాను.

READ MORE: హీరో అల్లు అర్జున్‌పై నటి సమంత షాకింగ్ కామెంట్స్

నాలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోయింది. నటన నుండి విరామం తీసుకోవడం నా ఉత్తమ నిర్ణయం. ఎందుకంటే నేను పనిని కొనసాగించే అవకాశం లేదు. పని ఒత్తిడితో పాటు పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టం. నేను కోలుకోవడానికి నాకు సమయం ఇచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాను.

నేను 13 సంవత్సరాలుగా నిరంతరం పని చేస్తున్నాను. నాకు బాగాలేదు కాబట్టి నన్ను నేను అసహ్యించుకోవడం మొదలుపెట్టాను. దీని వల్ల నేను ప్రేరణ పొందలేకపోయాను. కానీ నేను ఎల్లప్పుడూ మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించాను.

ఆ సమయంలో నేను నా అభద్రతాభావాలు, స్వీయ అసహ్యం గురించి లోతైన అవగాహనకు వచ్చాను. నన్ను నేను అర్థం చేసుకున్నాను. అంతేకాకుండా వాటిని పరిష్కరించగలిగాను. కాగా పరాజయాలు తనను మరింత బలపరిచాయని.. జీవితంలో ఎదురైన అపజయాలే గతంలో కంటే బలాన్ని పెంచాయని సమంత తెలిపింది. ప్రస్తుతం సమంత వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

READ MORE: ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డాను.. విడాకుల విషయం గుర్తుచేసుకున్న సమంత

కాగా సమంత చివరిగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఇక త్వరలో ఆమె బాలీవుడ్ వరుణ్‌ ధావన్‌తో కలిసి నటించిన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌ రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌లో సామ్ ఫుల్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ చేసినట్లు తెలుస్తోంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×