BigTV English

Sai Dharam Tej Upcoming Movie: హనుమాన్ మేకర్స్ తో మెగా మేనల్లుడు.. గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే?

Sai Dharam Tej Upcoming Movie: హనుమాన్ మేకర్స్ తో మెగా మేనల్లుడు.. గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే?
Advertisement

Update on Sai Dharam Tej New Movie: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తరువాత విరూపాక్షతో రీఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో వరుస సినిమాలను లైన్లో పెడతాడు అనుకుంటే మనోడు అన్ని సినిమాలు చకచక చేయకుండా మంచి కథలను ఎంచుకొని హిట్స్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.


ఇందులో భాగంగానే గాంజా శంకర్ అనే సినిమాను ప్రకటించాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సడెన్ గా ఆగిపోయిందని తెలుస్తోంది. దీంతో తేజ్.. మరో కొత్త సినిమాను లైన్లో పెట్టినట్లు సమాచారం. మెగా మేనల్లుడు ఈసారి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. రోహిత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు.

ఇక ఈ సినిమాను హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ప్రీ ఇప్పటికే ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం కానుందని టాక్. గాంజా శంకర్ పోతే పోయింది కానీ, మంచి ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టావ్ అన్నా అని అభిమానులు తేజ్ కు కంగ్రాట్స్ చెప్పుకొస్తున్నారు.


Also Read: Rajamouli: కేన్స్ లో సత్తా చాటిన యువకులు.. రాజమౌళి ప్రశంసలు

ఇకపోతే ఈ సినిమా కోసం నిరంజన్ రెడ్డి రూ. 100 కోట్ల బడ్జెట్ ను పెట్టనున్నాడట. తేజ్ కెరీర్ లోనే ఇప్పటివరకు ఇంత బడ్జెట్ పెట్టిన సినిమా ఏది లేదు. పీరియాడిక్ డ్రామా , మంచి విజువల్స్ కోసం నిరంజన్ రెడ్డి ఎంత పెట్టడానికి అయినా రెడీ అని అన్నట్లు టాక్. మరి తేజ్ తో ఇంత భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామా వర్క్ అవుట్ అవుతుందా.. ? ఇప్పుడు కుర్ర హీరోలు అందరూ ఇలా పీరియాడిక్ సినిమాలపై పడితే.. ఎవరు హిట్ అందుకుంటారో.. ఎవరు ప్లాప్ ను మూటకట్టుకుంటారో తెలియడంలేదు. మరి మెగా మేనల్లుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×