HBD Anjala Zaveri: ప్రముఖ హీరోయిన్ అంజలా జవేరి (Anjala Zaveri) గురించి నేటితరం యువతకు ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ (Venkatesh) తో ‘ప్రేమించుకుందాం రా’, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో ‘చూడాలని ఉంది’, నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) తో ‘సమరసింహారెడ్డి’ అంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని సూపర్ హిట్ అందుకున్న అంజలా జవేరి.. కెరియర్ పీక్స్ లో ఉండగానే సడన్గా ఇండస్ట్రీకి దూరమైంది. అటు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో 20 ఏళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి వివాహం చేసుకుంది. పెళ్లయి పదేళ్ల అవుతున్నా ఇంకా పిల్లలు మాత్రం కలగలేదని సమాచారం. ఇదిలా ఉండగా ఈరోజు అంజలా జవేరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈమె భర్త ఎవరు? పెళ్లయి ఇన్నేళ్లయినా ఎందుకు పిల్లలు కలగలేదు? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
90ల్లో ఫేవరెట్ హీరోయిన్ గా మారిన అంజలా..
1972 ఏప్రిల్ 20న లండన్, యునైటెడ్ కింగ్డమ్ లో జన్మించింది. అటు నుంచి హిందీ పరిశ్రమ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. 1997లో వచ్చిన ‘హిమాలయ్ పుత్ర’ అనే సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది . ఇక తర్వాత తెలుగులో ‘ప్రేమించుకుందాం రా’ అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ఈమెను ఓన్ చేసుకున్నారు. అలా తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అంజలా అదే ఏడాది తమిళ్ చిత్రంలో కూడా నటించి ఆకట్టుకుంది. అలా 2010 వరకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అంటూ తీరిక లేకుండా.. భాషతో సంబంధం లేకుండా.. మరింత బిజీగా గడిపిన ఈమె.. 2012లో తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ‘మాయా’ అనే టీచర్ పాత్ర చేసి ఇక ఇండస్ట్రీకి దూరమైంది. ఇక అప్పటి నుంచి మళ్లీ ఎక్కడ కనిపించలేదు.
అంజలా జవేరి భర్త ఎవరో తెలుసా..?
ఇక పెళ్లి తర్వాత అటు సినిమాలకి కూడా పూర్తిగా దూరమైంది అంజలా జవేరి. అయితే ఈమె భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి. ఆయన ఎవరో కాదు తరుణ్ అరోరా (Tarun Arora). రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకొని చిరంజీవి రీ ఎంట్రీ లో వచ్చిన ‘ఖైదీ నంబర్ 150’, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘కాటమరాయుడు’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘జయ జానకి నాయక ‘ తో పాటు ‘అర్జున్ సురవరం’ వంటి సినిమాలలో నటించి స్టైలిష్ విలన్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఇక వీరిద్దరిది ప్రేమ వివాహం.. దాదాపు 20 ఏళ్లు ఇద్దరూ ప్రేమించుకుని గత 10 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు.. అయినా ఇప్పటికీ ఈ జంటకు పిల్లలు లేరు అని, ప్రస్తుతం ఆమె ఫారిన్ లో ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్నేళ్లయినా ఎందుకు తల్లిదండ్రులు కాలేకపోతున్నారు అనే విషయం మాత్రం ఇప్పటికే రహస్యంగానే ఉంది. మరి వీళ్ళకు పిల్లలు పుట్టారా?లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈమె గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు అభిమానులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు..కానీ ఈమె మాత్రం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఇకపోతే ఈరోజు ఈ అమ్మడి పుట్టినరోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Hero Dhanush: ధనుష్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం.. భారీ నష్టం కూడా..!