E-Paper
Advertisement

Happy Birthday Sonu Sood: రియల్ హీరో సోనూ సూద్..తెలుగు అల్లుడని మీకు తెలుసా?

Happy Birthday Sonu Sood: రియల్ హీరో సోనూ సూద్..తెలుగు అల్లుడని మీకు తెలుసా?
Advertisement

Happy Birthday Real Hero Sonu Sood: సోనూసూద్..ప్రస్తుతం ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్. అయితే నిజ జీవితంలో మాత్రం అతనో రియల్ హీరో. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎక్కువగా వినిపించిన పేరు సోనూసూద్. ఆ సమయంలో ఎంతోమంది నిరుపేదలకు, అవసరం ఉన్న వారికి సహాయం చేస్తూ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. మొదట సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన..బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి గుర్తింపు పొందాడు. ఇంత మంచి మనసున్న మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ.. జూలై 30న పుట్టిన రోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

తెలుగుతో పాటు హిందీ సినిమాలు ఎప్పటినుంచో చేస్తున్నా..అరుంధతి సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా అనుష్కకి ఎంత పేరు వచ్చిందో..సోనూసూద్ కి అంతకంటే ఎక్కువ పాపులారిటీ వచ్చిందని చెప్పవచ్చు. ఇలా ఆయనకు ఏ ప్రాత చేసినా అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరిస్తుంటాడు.

Advertisement

సోనూసూద్ తెలుగులో అతడు సినిమాలో విలన్ పాత్రతో పాటు నమ్మకమైన మిత్రుడిగా పాత్రల్లో కనిపిస్తాడు. ఇలా రెండు రకాల ఎమోషన్స్ ఓకే సినిమాలో కనిపించి ఆకట్టుకున్నాడు. తర్వాత కామెడీ పరంగా కూడా ఆకట్టుకున్నాడు. దూకుడు, ఆగడు సినిమాల్లో విలన్ అయినా కామెడీ కూడా చేశాడు. అయితూ వీటికంటే ముందే సోనూ..1999 తమిళ సినిమా కల్లజగర్, నేంజీనిలే సినిమాలతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు విషయానికొస్తే..2000లో నాగబాబు హీరోగా చేసిన హాండ్సప్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత 2005లో సూపర్ సినిమాలో నాగార్జున కాంబినేషన్ లో కనిపించాడు.

Also Read: ఆర్తీ అగర్వాల్ కెరీర్ ను నాశనం చేసింది అతడే.. టార్చర్ పెట్టి..

Advertisement

సోనూసూద్ సినిమాల పరంగానే కాదు..పర్సనల్ లైఫ్ కూడా తెలుగు తో కనెక్షన్ ఉంది. ఆయన భార్య సోనాలి..తెలుగు అమ్మాయి కావడం విశేషం. సోనాలి పుట్టి పెరిగింది ముంబైలో అయినా గోదావరి టచ్ ఉందంట. ఆమె కూడా ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా రాణిస్తుంది. వీరిద్దరూ 1996లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ప్రయాణ ఔత్సాహికుల కోసం 2022లో ఎక్స్ ప్లర్గర్ అనే తన సొంత సోషల్ మీడియా యాప్‌ను సోనూ సూద్ ప్రారంభించాడు. ఆయన యాప్ నినాదం ‘యహన్ నహీ తో సోషల్ నహీ’. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఆయన భార్య సోనాలి కూడా ఒకరు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×