BigTV English

landslides hit hilly areas at Wayanad: వయనాడ్ జిల్లాలో కొండచరియల బీభత్సం, 31 మంది మృతి..ఇంకా

landslides hit hilly areas at Wayanad: వయనాడ్ జిల్లాలో కొండచరియల బీభత్సం, 31 మంది మృతి..ఇంకా

Wayanad landslide news today(Telugu flash news): కేరళను దేవభూమిగా చాలామంది చెబుతారు. అక్కడ ప్రకృతి కన్నెర్ర చేస్తే.. ఆ బీభత్సాన్ని అస్సలు ఊహించలేము. తాజా కేరళపై ప్రకృతి కన్నెర్ర చేసింది. భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి.


వయనాడ్‌ జిల్లా మెప్పాడి సమీపంలోని హిల్స్ ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రస్తుతానికి 31 మంది మృతి చెంది నట్టు సమాచారం. ఇంకా చాలామంది మట్టి చరియల కింద చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సమాచారం అందుకోగానే కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నాయి. భారీ వర్షాల కారణంగానే కొండ చరియలు విరిగిపడినట్లు అధికారులు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని తెలిపారు.


ALSO READ: జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన హౌరా ఎక్స్‌ప్రెస్, 60 మందికి గాయాలు..

కొండచరియల ఘటనలో చురల్మల పట్టణం కొంతభాగం డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ తరహా విపత్తు ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. కొండచరియలు విగిరిన ప్రాంతం ముండకైగా గుర్తించారు. ఈ ప్రాంతంలో తొలుత అర్థరాత్రి ఒంటిగంటకు, మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటన దాదాపు 400 కుటుంబాలపై పడినట్టు అంతర్గత సమాచారం. చాలామంది ఆచూకీ తెలియ లేదు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై కేరళ సీఎం విజయన్ రియాక్ట్ అయ్యారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. అంతేకాదు మృతులకు రెండు లక్షలు, గాయపడినవారికి 50 వేలు చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు.

 

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×