HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna)దర్శకత్వంలో చేస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal)హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం (AM Ratnam)భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే జూన్ 12వ తేదీన సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ రోజున సినిమాను విడుదల చేయడం లేదు.. పైగా మూడు తేదీలను పరిశీలనలో ఉంచగా అందులో జూలై 4వ తేదీన సినిమా విడుదల చేయడానికి త్రివిక్రమ్ (Trivikram ) ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే జూలై 4వ తేదీన రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘కింగ్డమ్’ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ.. నాగ వంశీ (Naga Vamsi)ని కన్విన్స్ చేసి త్రివిక్రమ్ ఆస్థానంలో హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలవడాల్సి ఉంది.
నిర్మాతకు గట్టి ఝలక్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో..
ఇదిలా ఉండగా విడుదల ఆగిపోయి ఆందోళనలో ఉన్న నిర్మాత ఏఎం రత్నం కి ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా గట్టి ఝలక్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. జూన్ 12 నుంచి హరిహర వీరమల్లు సినిమాను వాయిదా వేస్తే.. గతంలో చేసుకున్న డీల్ నుంచి రూ.20 కోట్లు కోత విధిస్తామని, అప్పట్లో కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే .ఇక అమెజాన్ ప్రైమ్ కండిషన్ మేరకు జూన్ 12న ఎలాగైనా సరే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో గతంలో చేసుకున్న డీల్ ప్రకారం ఇప్పుడు రూ.20 కోట్ల కోత విధించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటికే చాలా నష్టాలను ఎదుర్కొంటున్న నిర్మాతకు మరో రూ.20 కోట్లు భారీ నష్టం అని చెప్పవచ్చు.
హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..
పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా 2021 లోనే అనౌన్స్ చేశారు. కానీ పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. వాయిదా ఎన్నిసార్లు అంటే ఏకంగా 13 సార్లు వాయిదా పడగా. ఇప్పుడు 14వ సారి కూడా వాయిదా వేశారు. మరి జూలై 4వ తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నారు. ఆ రోజైనా సినిమా విడుదలవుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమా స్టోరీ మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైంది. కానీ పలు కారణాలవల్ల ఆయన సినిమా నుండి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ రంగంలోకి వచ్చారు. మరి ఇప్పుడు భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలా పలుమార్లు వాయిదా పడడంపై అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎప్పటికి ఫైనల్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తారో చూడాలి.
ALSO READ:Tollywood: ప్రముఖ నటి ఇంట్లో చోరీ.. దొంగతనం విలువ ఎంతంటే?