Destination Weddings| ఇండియాలో పెళ్లి అంటేనే పండుగ. అంగరంగ వైభవంగా అతిథులు, బంధుమిత్రులంతా ఈ వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఈ కాలంలో యువత పెళ్లి అంటే అర్థవంతంగా సన్నిహితలతో మాత్రమే ఓ వేడుక లాగా చేసుకోవాలని ఎంచుకుంటున్నారు. నగరాల్లో పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లకు బదులు.. కొండలు, బీచ్‌లు, రాజస్థానీ రాజభవనాల లాంటి అందమైన ప్రదేశాల్లో వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.ఇలాంటి పెళ్లిళ్లకు భారతదేశంలోని కొన్ని బెస్ట్ రిసార్ట్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్స్ లో పెళ్లి వేడుకలు మరపురాని గుర్తుగా మార్చే సౌకర్యం, ఆకర్షణ, అద్భుత వీక్షణలు ఉన్నాయి.
మేఫెయిర్ స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్, గౌహతి
గౌహతి నగరం నుంచి 20 నిమిషాల దూరంలో ఈ రిసార్ ఉంది. ఆకుపచ్చని కొండలు, ప్రశాంతమైన ప్రకృతి మధ్య ఈ రిసార్ట్ అద్భుతమైన లొకేషన్‌లో ఉంది. పాతకాలపు ఆకర్షణ, ఆధునిక సౌకర్యాల మిశ్రమంతో, ఇండోర్, ఔట్‌డోర్ వేదికలు చిన్న, అందమైన పెళ్లి వేడుకలకు సరిపోతాయి. స్టైలిష్ విల్లాలు, అద్భుత వీక్షణలు, హాయిగొలిపే ఆతిథ్యం ఈశాన్య భారతదేశంలో సన్నిహిత కుటుంబ పెళ్లికి ఇది గొప్ప ఎంపిక. స్పా, వెల్‌నెస్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ రిసార్ట్ ప్రత్యేకతలు: పూల్‌సైడ్ మెహందీ, ఓపెన్-ఎయిర్ మండపాలు, రిలాక్స్డ్ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు.
డెల్లా రిసార్ట్స్, లోనావలా
ముంబై, పూణే మధ్య ఉన్న ఈ రిసార్ట్ లగ్జరీ, సౌలభ్యాన్ని కలిపి అందిస్తుంది. వివిధ ఇండోర్, ఔట్‌డోర్ వేదికలు, స్టైలిష్ ఆర్కిటెక్చర్, అద్భుత ప్లానింగ్ సపోర్ట్‌తో మహారాష్ట్రలో సన్నిహిత పెళ్లిళ్లకు ఇది జనాదరణ పొందిన ఎంపిక. ఆకుపచ్చ పరిసరాలు, ఆధునిక సౌకర్యాలు చక్కటి వేడుకలకు అనువైనవి.
ఈ రిసార్ట్ ప్రత్యేకతలు: గ్లామరస్ పెళ్లిళ్లు, డిజైనర్ డెకర్, సన్నిహితులతో స్టైలిష్ గెట్‌అవే.
ది లీలా కోవలం, రవీజ్ హోటల్, కేరళ
సముద్రం ఒడ్డున కొండపై ఉన్న ఈ రిసార్ట్ లో శాంతమైన వాతావరణం, అందమైన సూర్యాస్తమయ వీక్షణకు ప్రసిద్ధి. ఆకుపచ్చని తోటలు, ఓపెన్ స్పేస్‌లు, స్నేహపూర్వక సేవలతో బీచ్‌సైడ్ చిన్న పెళ్లిళ్లకు అనువైనది.
ఈ రిసార్ట్ ప్రత్యేకతలు: సూర్యాస్తమయ సమయంలో పెళ్లి ప్రమాణాలు, సముద్ర వీక్షణ సెటప్‌లు, కేరళ శైలి ఆహారం.
ఐటీసీ రాజ్‌పుతానా, జైపూర్
ఈ రిసార్ట్ ఇండియాలోనే బాగా ఫేమస్. జైపూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి సమీపంలో ఉన్న ఈ రిసార్ట్ గంభీరమైన హవేలీ శైలిలో ఉంటుంది. ఓపెన్ కోర్ట్‌యార్డ్‌లు, పెద్ద బ్యాంక్వెట్ హాళ్లు, రాజస్థానీ డెకర్‌తో సాంప్రదాయ పెళ్లిళ్లకు అనుకూలం.
ఈ రిసార్ట్ ప్రత్యేకతలు: రాజస్థానీ శైలి పెళ్లిళ్లు, క్లాసిక్ ఇండియన్ డెకర్, చిన్న ఆకర్షణీయ వేడుకలు.
జెహాన్ నుమా ప్యాలెస్, భోపాల్
భోపాల్‌లోని ఈ హెరిటేజ్ రిసార్ట్ లో శాంతమైన వాతావరణంతో పాటు రాజసపు సెట్టింగ్ లు కూడా ఉన్నాయి. తెల్లని కొలనేడ్‌లు, విశాలమైన లాన్‌లు, రాజసమైన హాళ్లతో చరిత్ర, సౌకర్యాలను కలిపి అందిస్తుంది.
ఈ రిసార్ట్ ప్రత్యేకతలు: హెరిటేజ్ శైలి పెళ్లిళ్లు, అందమైన గార్డెన్స్‌లో వేడుకలు.
Also Read: ఏఐతో వినాశనం.. ప్రపంచ జనాభా 10 కోట్లకు క్షీణిస్తుంది.. నిపుణుల వార్నింగ్
రాజభవనాల నుంచి బీచ్ రిసార్ట్‌లు, కొండ విహారాల వరకు, భారతదేశంలో ఇంటిమేట్ వెడ్డింగ్ లు కోరుకునే వాళ్లకు భారతదేశంలో అద్భుతమైన వేదికలున్నాయి. ఈ ఐదు అందమైన రిసార్ట్‌లు మంచి సౌకర్యం, ఆతిథ్యంతో ప్రత్యేకంగా నిలుస్తాయి.