Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరో చుంకీ పాండే నట వారసురాలిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న అనన్య.. ఆ తరువాత అంతటి హిట్ ను అందుకోవడానికి చాలా కష్టపడింది. వరుస అవకాశాలను అందుకున్నా కూడా విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఎప్పుడెప్పుడు ఒక మంచి హిట్ దక్కుతుందా అని ఈ కుర్ర బ్యూటీ ఎదురుచూస్తూ ఉంది.
ఇక ఆ సమయంలోనే అమ్మడికి తెలుగు ఎంట్రీ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం తోనే అనన్య టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. లైగర్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఒక్క సినిమాతో అనన్య మళ్లీ టాలీవుడ్ ముఖం కూడా చూడలేదు. ఆ తరువాత బాలీవుడ్ లోనే సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. కాల్ మీ బే, కంట్రోల్ c లాంటి సిరీస్ లతో మంచి విజయాన్ని అందుకుంది.
సినిమాల మధ్యలో అమ్మడి బ్రేకప్ కూడా అయ్యింది. బాలీవుడ్ హాట్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ఈ చిన్నది.. ప్రేమాయణం నడిపింది. ఈ జంట చెట్టాపట్టాలేసుకుని కెమెరా కంటికి కనిపించడం, వెకేషన్స్, ఈవెంట్స్, ఫెస్టివల్స్ లో ఒకటిగా కనిపించారు. త్వరలోనే వీరి పెళ్లి జరుగుతుందని అందరూ ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. కానీ, ఈ జంట మాత్రం సడెన్ గా బ్రేకప్ అని చెప్పి విడిపోయారు. రెండేళ్ల రిలేషన్ ను బ్రేక్ చేస్తున్నట్లు అనన్య ఇన్ డైరెక్ట్ గా హింట్ కూడా ఇచ్చేసింది. ఇక బ్రేకప్ బాధ నుంచి కోలుకోవడానికి అనన్య.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండడం మొదలుపెట్టింది. వెకేషన్స్, టూర్లు అంటూ ఏవో ఫోటోలు పెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా అందాల ఆరబోత మాత్రం అస్సలు మర్చిపోదు.
తాజాగా ఈ చిన్నది రెడ్ కలర్ బికినీలో పిచ్చెక్కించింది. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. బికినీలో ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపించింది. మొదటి నుంచి కూడా అనన్య బికినీ డెడ్లీ కాంబో అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్ లో అనన్య పలు సినిమాలతో బిజీగా మారింది. మరి ముందు ముందు ఈ భామ తెలుగులో మరోసారి తన లక్ ను పరీక్షించుకుంటుందేమో చూడాలి.