Tollywood: ఈమధ్య కాలంలో దొంగలు ఎక్కువగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఇంట్లో దొంగలు చొరబడి వారిపై ఏకంగా హత్యాయత్నానికి పాల్పడితే, నిన్నటికి నిన్న సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంట్లో కూడా ఏకంగా ఒక జంట దొంగతనానికి పాల్పడి ఆయనపై హత్యా ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయాల నుండి తేరుకోక ముందే మరొక ప్రముఖ నటి ఇంట్లో దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ దొంగతనం విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ నటి ఇంట్లో దొంగతనం..
ఆమె ఎవరో కాదు ప్రముఖ బుల్లితెర నటి దేబీనా బెనర్జీ (Debina benarjee).. సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. నటనపై ఆసక్తితోనే “అమ్మాయిలు అబ్బాయిలు” అనే తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు తమిళంలో కూడా ఒక సినిమా చేసింది. ఇక సీరియల్స్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ నటుడు గుర్మీత్ చౌదరి (Gurmeet Chaudhary) ని ప్రేమించి మరీ రహస్యంగా వివాహం చేసుకుంది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మళ్లీ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక రియాల్టీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె సడన్గా తన ఇంట్లో దొంగతనం జరిగింది అంటూ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది.
బిగ్ అలర్ట్ అంటున్న సెలబ్రిటీ జంట..
తాజాగా ఇంస్టాగ్రామ్ లో అలర్ట్ అంటూ తన భర్త గుర్మీత్ చౌదరి షేర్ చేసిన పోస్ట్ ని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకుంది. “బిగ్ అలర్ట్: మా ఇంట్లో దొంగతనం జరిగింది. కొత్తగా వచ్చిన పనిమనిషి మా ఇంట్లో నుండి కొన్ని విలువైన వస్తువులను తీసుకెళ్లిపోయారు. అందుకే మా ఇంట్లో ఇకపై ఎవరు పనిలోకి చేరాలనుకుంటున్నా.. వారి డీటెయిల్స్ ను ఒకటికి రెండుసార్లు పరిశీలించి, ఆ తర్వాత తీసుకుంటున్నాను. దీనివల్ల పోయిన వస్తువులను సులభంగా తిరిగి రాబట్టుకోవడం మరింత సులువుగా మారింది. కానీ దొంగతనం జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. నా పిల్లలు వారి వారి బెడ్ రూమ్ లో ఉన్నారు. ఇలా జరగడం మా దురదృష్టం. కానీ ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేర్చుకున్నాను. ఇక మీ ఇంట్లో కూడా ఎవరినైనా పనికి చేరుతున్నారు అంటే ముందుగానే వారి గురించి తెలుసుకొని మరీ వారిని పనిలోకి పెట్టుకోవడం ఉత్తమం అంటూ తెలిపారు గుర్మీత్ చౌదరి. ఇక ఈ విషయాన్ని దేబీనా బెనర్జీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకుంది.
దొంగతనం విలువ ఎంతంటే?
ఇకపోతే ప్రస్తుతం గుర్మీత్ చౌదరి షేర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే తన ఇంట్లో దొంగతనం జరిగిందని , విలువైన వస్తువులను తీసుకెళ్లిపోయారు అంటూ ఈ జంట తెలిపారు కానీ వాటి విలువ ఎంత అనేది మాత్రం చెప్పలేదు. ఇక మొత్తానికైతే దొంగతనం ఎఫెక్ట్ తనపై భారీగా పడిందని, దానివల్ల అందరిని అలర్ట్ చేస్తున్నానంటూ కూడా చెప్పుకు వచ్చింది. ప్రస్తుతం ఈ విషయాలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.
ALSO READ:Ravi Teja New Movie : అన్నయ్యతో అమీతుమీ… పోటీ సరే మరి పై చేయి సాధిస్తాడా ?