Hari Hara Veera Mallu Songs: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు. పవన్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా ‘హరిహర వీరమల్లు’ నిలిచింది. ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి మొదలు పెట్టాడు. కానీ రోజు రోజుకి షూటింగ్ డిలే అవడంతో.. ఆయన మధ్యలో నుంచి తప్పుకున్నాడు. దీంతో.. నిర్మాత ఏఎం. రత్నం కుమారుడు ఎ.ఎమ్. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటుగా కనిపించనున్నాడు పవన్ కళ్యాణ్‌తో సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అవగా.. తాజాగా హరిహర వీరమల్లు నుంచి థర్డ్, ఫోర్త్ సాంగ్స్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు మేకర్స్.
రెండు సాంగ్స్ రిలీజ్ అప్పుడే?
“హరిహర వీరమల్లు” సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టాయి. మొదటి పాట “మాట వినాలి”ని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషం. ఇది అభిమానులకు పెద్ద ట్రీట్‌గా నిలిచింది. రెండో పాట “కొల్లగొట్టినాదిరో” చార్ట్‌బస్టర్‌గా నిలిచి, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ పాటలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు మేకర్స్ మూడో పాటను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పాట ఏప్రిల్ 10, 2025న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, నాలుగో పాటను ఏప్రిల్ 15, 2025న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు పాటల్లో ఒకటి మాస్ బీట్‌తో కూడిన ఎనర్జిటిక్ సాంగ్ కాగా, మరొకటి మెలోడీ సాంగ్ అని తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో మేకర్స్ సైడ్ నుంఇ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి పవన్ ఫ్యాన్స్ వీరమల్లు కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నార.
నో డౌట్స్.. ఈసారి పక్కా?
హరిహర వీరమల్లు సినిమా 2020 సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. కానీ కోవిడ్ మహమ్మారి మరియు పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా కావడంతో.. షూటింగ్‌లో ఆలస్యం జరిగింది. ఫైనల్‌గా ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. వాస్తవానికైతే.. మార్చి 28న వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ బ్యాలెన్స్ కారణంగా మే 9కి షిప్ట్ అయ్యారు. అయినా కూడా రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యాక్తమవుతున్నాయి. కానీ పవన్ ఈ డేట్ టార్గెట్‌గా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ ఏప్రిల్ లోపు తన షూటింగ్ పోర్షన్‌ను పూర్తి చేయనున్నారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి.. అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మరి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని వస్తున్న హరిహర వీరమల్లు ఎలా ఉంటుందో చూడాలి.