BigTV English

Hit 3: అదే ఫార్ములా ఫాలో అవుతున్న శైలేష్ కొలను.. ‘హిట్ 3’ క్లైమాక్స్‌లో ఆ హీరో క్యామియో..

Hit 3: అదే ఫార్ములా ఫాలో అవుతున్న శైలేష్ కొలను.. ‘హిట్ 3’ క్లైమాక్స్‌లో ఆ హీరో క్యామియో..

Hit 3: హాలీవుడ్‌లో యాక్షన్ యూనివర్స్‌లాగా టాలీవుడ్‌లో కూడా ఒక యూనివర్స్ ప్రారంభమయ్యింది. అదే హిట్‌వర్స్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్’ అనే మూవీతో ఈ హిట్‌వర్స్ స్టార్ట్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలతో తెరకెక్కుతున్న ఈ ఫ్రాంచైజ్‌లోని సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో దీనిని ఒక యూనివర్స్‌గా మార్చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ ‘హిట్’ ఫ్రాంచైజ్ నుండి రెండు సినిమాలు రాగా మరో సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అదే నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హిట్ 3’. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ బయటికొచ్చింది.


సీక్వెల్‌పై హింట్

వరుసగా యంగ్ హీరోలను పెట్టి హిట్‌వర్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు శైలేష్ కొలను. క్రైమ్ థ్రిల్లర్స్‌ను ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించడంతో శైలేష్ కొలను టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ‘హిట్’లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’లో అడవి శేష్.. పోలీస్ పాత్రల్లో ఆడియన్స్‌ను విపరీతంగా మెప్పించారు. ఇప్పుడు అదే హిట్‌వర్స్‌లోకి నాని ఎంటర్ అయ్యాడు. అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు నాని (Nani). ఇప్పటివరకు నాని ఎక్కువగా పక్కింటబ్బాయి పాత్రల్లోనే కనిపించి నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ అర్జున్ సర్కార్ అలా కాదు.. చాలా డిఫరెంట్, వైలెంట్. ఇక ‘హిట్ 3’ చివర్లోనే ‘హిట్ 4’కు సంబంధించిన హింట్ ఉండనుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


క్యామియో ఫిక్స్.?

‘హిట్ 2’లో అడవి శేష్ హీరో అయినా ఆ మూవీ క్లైమాక్స్‌లో నానిని అర్జున్ సర్కార్‌గా ముందే ప్రేక్షకులకు పరిచయం చేశాడు శైలేష్ కొలను (Sailesh Kolanu). అప్పుడే ‘హిట్ 3’ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. ‘హిట్ 4’ విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వనున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ‘హిట్ 3’ చివర్లో ఈ ఫ్రాంచైజ్‌లో తరువాత జాయిన్ అవ్వనున్న హీరో గురించి హింట్ ఇవ్వనున్నాడట. అయితే ఆ హీరో మరెవరో కాదు.. కోలీవుడ్ ప్రామిసింగ్ యాక్టర్ కార్తి. కార్తి ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడంటే చాలు.. కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. ఆ హైప్ ఇప్పుడు హిట్‌వర్స్‌కు కూడా ఉపయోగపడనుంది.

Also Read: జీవి ప్రకాశ్‌తో డేటింగ్.. రూమర్స్‌పై స్పందించిన దివ్యభారతి..

వైలెంట్‌గా కనిపించలేదు

‘హిట్ 3’ (Hit 3) సినిమాలో కార్తి (Karthi) ఒక క్యామియో చేయనున్నాడని సమాచారం. అంటే ‘హిట్ 4’లో తనే హీరో అని దర్శకుడు హింట్ ఇచ్చేసినట్టే. కార్తి ఇప్పటివరకు పలు సినిమాల్లో పోలీస్ పాత్రల్లో కనిపించాడు. కానీ మరీ శైలేష్ కొలను హీరోలాగా వైలెంట్‌గా కనిపించింది చాలా తక్కువ. ఇక కార్తిలాంటి హీరో ఇలాంటి దర్శకుడి చేతిల్లో పడితే తనను మరెంత వైలెంట్‌గా చూపిస్తాడో అని ప్రేక్షకుల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. నిజంగా ‘హిట్ 3’లో కార్తి క్యామియో ఉంటే అది సినిమాకు విపరీతమైన ప్లస్ అవుతుంది. ఇప్పటికే అర్జున్ సర్కార్‌గా నాని అందరినీ మెప్పించగా.. మరొక పోలీస్ పాత్రలో కార్తి కనిపిస్తే ఈ మూవీ హిట్ పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×