BigTV English

Tollywood Heroine : పెళ్లి రోజునే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ..

Tollywood Heroine : పెళ్లి రోజునే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ..

Tollywood Heroine : తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్ల బాట పట్టారు. కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటే మరికొందరు మాత్రం పెళ్లి చేసుకొని తల్లి తల్లిదండ్రులు అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్లు పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు గానీ తర్వాత మళ్లీ తమ కెరియర్ వైపు ఫోకస్ చేస్తున్నారు. ఆ లిస్టులో ఇప్పటికే కాజల్ అగర్వాల్ ప్రణీత సుభాష్ లో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ లోని ఓ హీరోయిన్ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఆమె ఎవరో కాదు.. నాచురల్ స్టార్ నాని నటించిన పిల్ల జమిందార్ హీరోయిన్ హరిప్రియ. ఇటీవల ఆమె సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఓ పన్నంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది..


ఈ విషయాన్ని ఆమె భర్త నటుడు వశిష్ట సింహ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దాంతో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న హరిప్రియ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైందని తెలిసిందే. నటుడు వశిష్టతో ఆమె పెళ్లి జరిగిన తర్వాత ఆమె పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. గర్భం ధరించగానే షూటింగులకు దూరం అయ్యింది. ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది.. రీసెంట్ ఆమె సీమంతం ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇక ఆదివారం హరిప్రియ, వశిష్ట లు తల్లి దండ్రులు అయ్యారు.. దంపతులకు కుటుంబ సభ్యులు, బంధువులు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇకపోతే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అదేంటంటే ఈ దంపతులు తమ పెళ్లి రోజే తల్లి దండ్రులు అయ్యారు. ఈ జంట 2023 జనవరి 26న వివాహం చేసుకున్నారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత, అంటే జనవరి 26, 2025న పండంటి బిడ్డ మా మధ్యలోకి వచ్చాడని వశిష్ట పోస్ట్ చేసిన పేర్కొన్నాడు. ఈ కన్నడ జంట వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హరిప్రియ మాత్రం గర్భం దాల్చిన తర్వాత సినిమాలకు కంప్లీట్ గా దూరమయ్యారు. ఇక వశిష్ఠ మాత్రం తెలుగు కన్నడ చిత్రాల్లో పలు కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. హరిప్రియ తెలుగులో నాని పిల్ల జమీందార్ తో పాటు వరుణ్ సందేశ్‌తో కలిసి అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా మూవీల్లో నటించింది. అంతేకాదు చివరగా నందమూరి హీరో బాలయ్య నటించిన జై సింహా సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది.. ఈమధ్య సినిమా హీరోయిన్లు పిల్లలు కలిగిన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీ అవుతున్నారు. మరి హరిప్రియ కూడా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందేమో చూడాలి..


 

View this post on Instagram

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×