Rasha Thadani: ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఎప్పుడు ఎవరి ప్రేమలో పడతారో చెప్పడం అసాధ్యం. కొంతమంది తమకంటే వయసులో చిన్న వారితో డేటింగ్ మొదలు పెడితే, మరికొంతమంది తమకంటే వయసులో చాలా పెద్దవారితో ప్రేమలో పడడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు కూడా. అయితే ఇప్పుడు ఒక 19 ఏళ్ల స్టార్ కిడ్ ఏకంగా 40 ఏళ్ల వ్యక్తిపై మనసు పారేసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ముద్దుగుమ్మకు ఏమైంది అంటూ కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం.. మరి ఆమె ఎవరు ? ఆ 40 ఏళ్ల వ్యక్తి ఎవరు? ఇప్పుడు చూద్దాం..
నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన స్టార్ కిడ్..
రాషా థడాని (Rasha Thadani).. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్(Raveena Tandon) కుమార్తె.. తల్లి నట వారసత్వాన్ని పుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రాషా తడానీ. అభిషేక్ కపూర్ (Abhishek Kapoor), దర్శకత్వంలో అజయ్ దేవగన్(Ajay Devgan) మేనల్లుడు అమన్ దేవగన్ (Aman Devgan) తో కలిసి ఈమె ‘ఆజాద్’ అనే సినిమా చేసింది. ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అందుకోవడంతో అందరి దృష్టి ఈమె పైనే పడిందని చెప్పవచ్చు. తల్లికి మించిన అందంతో.. రూప లావణ్యంతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది. ఇకపోతే రాషా ఆజాద్ సినిమా ప్రమోషన్స్లో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో ఎవరిపై తన క్రష్ ఉందో కూడా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.
అతడంటే చాలా ఇష్టం..
రాషా తడానీ మాట్లాడుతూ..” నా మొదటి పరిశ్రమకు చెందిన క్రష్ సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra)అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా అంటే చాలా ఇష్టం” అని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా 19 ఏళ్ల ఈమె.. 40 ఏళ్ల వ్యక్తిపై ప్రేమ పెంచుకోవడం ఏంటో? అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
రవీనా టాండన్ కెరియర్..
రవీనా టాండన్ విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటిగా పేరు దక్కించుకున్న ఈమె, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు రవి టాండన్(Ravi tandon) కుమార్తెగా 1991లో వచ్చిన యాక్షన్ చిత్రం ‘పత్తర్ కా ఫూల్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో ఉత్తమ మహిళ అరంగేట్రానికి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాత కమర్షియల్ గా విజయం సాధించిన దిల్వాలే, మొహ్రా, జిద్ధి వంటి పలు చిత్రాలలో నటించి, భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా అద్భుతమైన నటన కనబరిచిన నేపథ్యంలో ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుతో పాటు నేషనల్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు, భారత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డులు కూడా ఈమెకు లభించాయి. ఇక 2022లో వచ్చిన ‘కేజిఎఫ్ చాప్టర్ 2’ సినిమాలో కీలక పాత్ర పోషించి అందరి మనసులు దోచుకుంది. ఇక తల్లిదండ్రులు కూడా సెలబ్రిటీలు కావడంతో ఈమె సినీ ఇండస్ట్రీ ఎంట్రీకి పెద్దగా ఇబ్బంది పడలేదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈమె బాటలోని ఈమె కూతురు కూడా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.