వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా రాణి నగర్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆఫియా అనే ఏడాది చిన్నారిపై వేడి వేడి గంజి పడి.. చిన్నారి మొహం, చేతులు ఖాళీ పోయాయి. అయితే గంజో, నూనో, వేడి నీళ్లో పోశారో తెలియదిని తలిదండ్రులు చెబుతున్నారు. ఇంటి సమీపంలో ఉన్నవారు చిన్నారితో ఆడుకుంటామని చెప్పి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే కొద్దిసేపటికే చిన్నారే గంజి పోసుకుందని చెప్పడంతో పక్కింటి వారు చెప్పడంతో హుటాహుటినా చిన్నారిని హాస్పిటల్ కు తరలించారు. అనంతపురంలోని హాస్పిటల్లో వైద్యం అందించినా.. చిన్నారి పరిస్థితి విషమించడంతో కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
Also Read: రచ్చ లేపిన ఫ్లెక్సీ.. కేడర్ మధ్య కర్రలతో ఫైటింగ్, అసలేం జరిగింది?
అయితే చిన్నారి మొహం, తల భాగం ఎక్కువగా కాలిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు డాక్టర్లు. అయితే ఇంటి పక్కన వారు గంజి పోశారా.. వేడి నీళ్లు పోశారా.. వేడీ నూనె పోశారా లేక ప్రమాదశాత్తు పడిందా అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. చిన్నారి శరీరంపై ఏం పడిందనేది తెలిస్తే ట్రీట్మెంట్ చేయడానికి సులువు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నారిపై ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ చిన్నారికి అండగా ఉండాలంటూ సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు.