Keerthi Suresh:ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ మేనక(Menaka) వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్(Keerthi Suresh). చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అబ్బాయిలనే కాదు అమ్మాయిలను కూడా ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించిన ఈమె ‘మహానటి’ సినిమాతో వెనుతిరిగి చూసుకోలేదు. దివంగత సీనియర్ నటీమణి సావిత్రి(Savithri) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాల్లో సావిత్రి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఉత్తమ నటన కనబరిచినందుకు ‘నేషనల్ అవార్డు’ కూడా లభించింది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహించారు. అంతేకాదు ఈ సినిమా ద్వారానే ప్రముఖ మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquar salman)కూడా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
పెళ్లి తర్వాత అసలైన కష్టాలు..
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీ(Antony) ని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది.ముఖ్యంగా గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ ఏడాది బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా ‘బేబీ జాన్’ సినిమాలో హీరోయిన్గా నటించింది. కీర్తి పెళ్లి తర్వాత ఈ సినిమా విడుదలయ్యింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బెడిసికొట్టిందని చెప్పవచ్చు. దీనికి తోడు బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత మీడియా నుంచీ కూడా అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఆమె జాతకంలో దోషం అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
జాతకం వల్లే ఇలా జరుగుతోందా..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కీర్తి సురేష్ కి పెళ్లి జరిగిన తర్వాత అన్ని నష్టాలే ఎదురవుతున్నాయని, ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుక్కున్న మొదటి హిందీ సినిమానే ఫ్లాప్ అవడంతో.. ఈమె బ్యాడ్ లక్ మొదలైందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు కీర్తి సురేష్ కి పెళ్లి జీవితం సరిగా కలిసి రాలేదని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. దీనికి కారణం కీర్తి సురేష్ జాతకంలో ఉన్న దోషం వల్లే ఆమెకు ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయట. ఇలాంటి నష్టాల నుండి బయటపడాలంటే దోష నివారణ పూజలు చేయించాలని.. లేకపోతే ఈ ఫలితాలు మరింతగా పెరిగిపోయి, ఆ ప్రభావం సినీ కెరియర్ పై కూడా పడుతుందనే రూమర్స్ ఇప్పుడు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి.
లాజిక్ ఏంటంటే..?
అయితే లాజిక్ గా ఆలోచిస్తే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రభావం మొత్తం కెరియర్ పైన పడుతుంది అనడంలో నిజం లేదు. అలాగే కీర్తి సురేష్ ,వరుణ్ ధావన్ కాంబోలో వచ్చిన బేబీ జాన్ సినిమా సరిగా ఆడియన్స్ లోకి వెళ్లకపోవడం వల్లే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీనికి తోడు హిందీలో ఇప్పటికీ కూడా పుష్ప2 సినిమా హవా కొనసాగుతోంది. కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వాస్తవానికి ఒక కథకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అంటే ఇంకొక కథను అంత త్వరగా ఓన్ చేసుకోలేరు. ఈ రకంగా కూడా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణమని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఒక సినిమా ఫ్లాప్ అవడంతో ఆమె పెళ్లిని అడ్డం పెట్టుకొని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం నిజంగా అవాంఛనీయమని అభిమానులు మండిపడుతున్నారు.