BigTV English
Advertisement

Devara 2: దేవర 2 క్యాన్సిల్ అయిపోయినట్టేనా? మరి ఉంటే కొరటాల అప్పటివరకు ఆగుతారా.?

Devara 2: దేవర 2 క్యాన్సిల్ అయిపోయినట్టేనా? మరి ఉంటే కొరటాల అప్పటివరకు ఆగుతారా.?

Devara 2: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లు కొరటాల శివ ఒకరు. మిర్చి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శివ వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ కొట్టారు. ప్రభాస్, మహేష్ బాబు , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో మంచి సక్సెస్ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేసే అవకాశం దక్కింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అసలు ఈ సినిమా కొరటాల ఇలా తీసాడు ఏంటి అని అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారు. ఎన్టీఆర్ అవకాశం ఇవ్వడంతో దేవర సినిమా చేశాడు. దేవర సినిమాకి మొదటి టాక్ డిఫరెంట్ గా వచ్చినా కూడా మెల్లమెల్లగా పుంజుకొని బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.


దేవర తో కం బ్యాక్ 

దేవర సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన తీరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముఖ్యంగా అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఈ సినిమా మొదటి పార్ట్ పూర్తి అవగానే చాలా ప్రశ్నలు చాలామంది ప్రేక్షకులకు ఉండిపోయాయి. వాటన్నిటికీ కూడా దేవర 2 లో సమాధానం దొరుకుద్ది అని టీం అనౌన్స్ చేశారు. ఇకపోతే ఇప్పుడు దేవర సినిమా ఉంటుందో ఉండదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఎన్టీఆర్ పెట్టుకున్న లైనప్.


భారీ లైనప్

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2026 లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమా తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నెల్సన్ దర్శకుడుగా ఒక సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమాను చేయనున్నారు. ఈ సినిమా 2028లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదివరకు వీరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయింది. ప్రస్తుతం మూడు సంవత్సరాలు వరకు ఎన్టీఆర్ కంప్లీట్ బిజీగా మారిపోతున్నాడు. ఈ తరుణంలో కొరటాల శివతో దేవర 2 సినిమా జరుగుతుందా లేదా అనేది అందరికీ వస్తున్న సందేహం. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.

Also Read: Naga Vamsi: సినిమాల్లోకి రాకముందే ఆ హీరోకి అడ్వాన్స్ ఇచ్చాడు, ఒక నిర్మాత విజన్ ఇలా ఉండాలి

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×