BigTV English

OTT Movie : 60 ఏళ్ల వయసులో రాత్రి పూట ఆ పని … ఇతని కథలు మామూలుగా లేవయ్యా సామీ

OTT Movie : 60 ఏళ్ల వయసులో రాత్రి పూట ఆ పని … ఇతని కథలు మామూలుగా లేవయ్యా సామీ

OTT Movie : కోల్‌కతాలోని రద్దీగా ఉండే గల్లీల్లో తారిణి బందోపాధ్యాయ్ అనే 60 ఏళ్ల వృద్ధుడు నివశిస్తుంటాడు. అతని జీవితంలో ఇప్పటి వరకు 73 ఉద్యోగాలు మారాడు. కానీ కథలు చెప్పడమే అతని నిజమైన అభిరుచి. అతని కథలను కాగితంపై ప్రచురించడానికి అతను ఇష్టపడడు. వాటిని నోటిమాటగా చెప్పడంలోనే అతనికి ఆనందం ఉంటుంది. ఒక రోజు అతనికి ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది. ఇది నిద్రలేమితో బాధపడే ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తకు కోసం కథలు చెప్పే ఉద్యోగం.అయితే తారిణి అక్కడికి వెళ్ళాక అతని కథలు దొంగిలించబడతాయి. అతని కథలు అతని సొంతం కాదని ప్రపంచం నమ్ముతుంది. తారిణి ఈ ద్రోహాన్ని ఎలా ఎదుర్కొంటాడు? అతని కథలు తిరిగి తనవిగా చేసుకోగలడా ? లేదా ఈ ఆటలో అతను ఓడిపోతాడా? ఈ సినిమా వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

తారిణి బందోపాధ్యాయ్ కోల్‌కతాలోని ఒక మధ్యతరగతి బెంగాలీ. 60 ఏళ్ల వయసులో పబ్లిషింగ్ హౌస్ నుండి రిటైర్ అయిన వ్యక్తి. అతను 73 ఉద్యోగాలు మారినా కానీ కథలు చెప్పడం మానకుండా ఉంటాడు. అతను రవీంద్రనాథ్ టాగోర్ పుస్తకాలు, చేపలు, దుర్గా పూజా పట్ల ఆసక్తి కలిగిన ఒక సాంప్రదాయ బెంగాలీ. అతని కథలు సాహసం, ఫాంటసీ, మిస్టరీతో నిండి ఉంటాయి. కానీ అతను వాటిని ప్రచురించడానికి ఇష్టపడడు. ఎందుకంటే అతనికి కథలు చెప్పడంలోనే ఆనందం ఉంది. అతని కుటుంబం, ముఖ్యంగా అతని స్నేహితుడు బంకిమ్ (రోహిత్ ముఖర్జీ) కథలను ప్రచురించమని అతన్ని ప్రోత్సహిస్తారు. కానీ తారిణి తన కథలను కాగితంపై రాయడానికి నిరాకరిస్తాడు. ఒక రోజు అహ్మదాబాద్‌లో ఒక వ్యాపారవేత్త, రతన్ గరోడియా (ఆదిల్ హుస్సేన్), నిద్రలేమితో బాధపడుతూ, తనకు ప్రత్యేకమైన ప్రచురించని కథలు చెప్పే వ్యక్తి కావాలని ఓ ప్రకటన ఇస్తాడు.


రతన్ ఒక ధనవంతుడైన గుజరాతీ వ్యాపారవేత్త. అతనికి విలాసవంతమైన కాటన్ షీట్లను తయ్యారు చేసే ఫ్యాక్టరీ ఉంటుంది. అయితే అతను 30 ఏళ్లుగా నిద్రలేమితో బాధపడుతున్నాడు. ఇతనికి కథలు చెప్పే ఉద్యోగంలో తారిణి  జాయిన్ అవుతాడు.  అక్కడ అతను రతన్‌కు ప్రతి రాత్రి కథలు చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ కథలు రతన్‌ను ఆకట్టుకుంటాయి. ఇద్దరి మధ్య ఒక ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. రతన్ తన యవ్వనంలో ప్రేమించిన సరస్వతి గురించి, తారిణితో తన గతాన్ని పంచుకుంటాడు. ఆమె ఇప్పుడు ఒక వితంతువుగా ఉంటుంది. అతను ఆమెతో తిరిగి సంబంధం ఏర్పరచుకోవాలని కోరుకుంటాడు. అయితే ఇంతలో తారిణి తన కథలు ‘గోర్ఖే’ అనే పేరుతో, ఒక మ్యాగజైన్‌లో ప్రచురించబడినట్లు తెలుసుకుని షాక్ అవుతాడు. తారిణికి ఈ ద్రోహాన్ని చేసింది ఎవరు ? అతను తన కథలను తిరిగి సొంతం చేసుకుంటాడా ? ఇందుకు అతను ఎలాంటి పథకం వేస్తాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఆడవాళ్ళ కాళ్ళను కత్తిరించి చంపే సైకో … ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్టులు… ఒళ్ళు గగుర్పొడిచే సీన్లు

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ బాలీవుడ్ మూవీ పేరు ‘ది స్టోరీ టెల్లర్’ (The Storyteller). 2025 లో వచ్చిన ఈ సినిమా సత్యజిత్ రే రాసిన ‘Golpo Boliye Tarini Khuro’ కథ ఆధారంగా రూపొందింది. అనంత్ మహదేవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.  పరేష్ రావల్, ఆదిల్ హుస్సేన్, రేవతి, తన్నిష్ఠా చటర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా 27వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. జియో హాట్‌స్టార్‌ (Jio hotstar) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైంది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×