Pawan Kalyan : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిజాస్టర్ సినిమాతో కూడా కలెక్షన్స్ వసూలు చేసి రేంజ్ ఆయనకు మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతం చాలామందికి పవన్ కళ్యాణ్ కి ఈ క్రేజ్ ఎలా వచ్చిందో తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు యూత్ కి చాలా క్లారిటీ ఉంది. వరుసగా ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలు పడడంతో పవన్ కళ్యాణ్ రేంజ్ విపరీతంగా మారిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన జానీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ పెరుగుతూ వెళ్ళింది తప్ప ఎక్కడ తగ్గలేదు. ప్రాపర్ హిట్ లేకపోయినా కూడా మార్కెట్ ఏమాత్రం దెబ్బ తినలేదు.
ఇకపోతే పవన్ టాలెంట్ గురించి చాలామందికి తెలిసిందే. కేవలం నటుడుగానే కాకుండా సింగర్ గా కూడా చాలా సినిమాల్లో తన టాలెంట్ బయటికి తీసాడు. అలానే జానీ సినిమాతో దర్శకుడుగా చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. ఖుషి సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఏ రేంజ్ లో ఉందో పలు ఇంటర్వ్యూస్ లో చాలామంది చెప్పుకొచ్చారు. చాలామంది టెక్నీషియన్స్ తో కూర్చుని ఎడిటింగ్ రూమ్ లో తన సినిమాను ఎడిట్ చేయించిన రోజులు కూడా ఉన్నాయి. ఇక అందరికీ పవన్ కళ్యాణ్ అని మాత్రమే తెలుసు కానీ పవన్ కళ్యాణ్ కి ఇంకో అసలు పేరు ఉంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి ఇంట్లో పెట్టిన పేరు శ్రీ కళ్యాణ్ కుమార్. అది కాస్త పవన్ కళ్యాణ్ గా మారింది.
ఇక మెగా బ్రదర్స్ నాగబాబు , పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీలో తమకంటూ సొంత గుర్తింపును కూడా సాధించుకున్నారు. ఇక నాగబాబు కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా చాలా సినిమాలను నిర్మించారు. ఇక నాగబాబు తో పాటు పవన్ కళ్యాణ్ కూడా రుద్రవీణ అనే సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఇక రుద్రవీణ సినిమా టైటిల్స్ లో కూడా కళ్యాణ్ కుమార్ అని నిర్మాత టైటిల్ పడుతుంది. రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి పవన్ అసలైన పేరును రీవీల్ చేశారు.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమా రంగంలోనూ అటు రాజకీయ రంగంలోని బిజీగా మారారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత 2024లో డిప్యూటీ సీఎం గా పదవిని చేపట్టి రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నాలుగు సినిమా ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు అనే ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు కళ్యాణ్. హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా లైనప్ లో ఉంది.