Diwali Movies Collections: తెలుగు పండగలంటే సినిమా పండగలే. ఆ రోజు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతాయి. అనూహ్యంగా చాలాసార్లు అన్ని సినిమాలకు సమానంగా ఆదరణ కూడా లభిస్తుంది. ఈసారి కూడా దీపావళి రేసులో ఆరు సినిమాలు బరిలోకి దిగాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చి 10 రోజులు అవుతోంది. ఇవన్నీ ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతున్నాయి. బడ్జెట్, కలెక్షన్స్.. రెండిటినీ పోల్చి చూస్తే ఈసారి దీపావళి విన్నర్ ఎవరు అనేదానిపై ఓ లుక్కేయండి.
బాలీవుడ్ టాప్
ఈ దీపావళికి సౌత్ సినిమాలతో పాటు రెండు హిందీ చిత్రాలు కూడా థియేటర్లలో పోటీపడ్డాయి. అవే ‘భూల్ భూలయ్యా 3’ (Bhool Bhulaiyaa 3), ‘సింగం అగైన్’ (Singham Again). ‘భూల్ భూలయ్యా’ అనేది హిందీలోనే అతిపెద్ద హారర్ మూవీ ఫ్రాంచైజ్. అలాంటి ఫ్రాంచైజ్ నుండి ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్ కాగా ‘భూల్ భూలయ్యా 3’ అయితే ఓపెనింగ్స్‌తోనే కోట్లలో కలెక్షన్స్ కొల్లగొట్టింది. కార్తిక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ విడుదలయిన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.320 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్ తరపున వచ్చి దీపావళి విన్నర్‌గా నిలిచింది.
Also Read: ఓ కమల్, రజినీ, విజయ్… తర్వాత శివ కార్తికేయన్..
‘అమరన్’ గెలిచాడు
‘భూల్ భూలయ్యా 3’కు పోటీగా బాలీవుడ్ మరో ఫ్రాంచైజ్‌ను దీపావళి రంగంలోకి దించింది. అదే ‘సింగం అగైన్’. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ క్యాస్టింగ్‌తోనే హైప్ క్రియేట్ చేసింది. అలాగే కలెక్షన్స్ విషయంలో కూడా సూపర్ హిట్ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ‘సింగం అగైన్’ మూవీ రూ.315 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక సౌత్ సినిమాల విషయానికొస్తే.. ముందుగా రేసులో ‘అమరన్’ (Amaran) దూసుకుపోయింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ముందు నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శివకార్తికేయన్, సాయి పల్లవి తమ నటనతో ఆడియన్స్‌ను కంటతడి పెట్టించారు. అలా ప్రపంచవ్యాప్తంగా ‘అమరన్’కు రూ.244 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
అవే బ్లాక్‌బస్టర్స్
తెలుగులో ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన సినిమాలు మరో రెండు ఉన్నాయి. అవే ‘లక్కీ భాస్కర్’, ‘క’. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ వైపుకు దూసుకుపోతోంది. అలాగే భారీ ప్రమోషన్స్‌తో ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేసిన ‘క’కు రూ.34 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో ప్యాన్ ఇండియా మూవీ అయిన ‘భగీరా’ కేవలం రూ.26 కోట్ల కలెక్షన్స్‌తో సరిపెట్టుకుంది. అన్ని రకాలుగా చూస్తే.. ‘భూల్ భూలయ్యా 3’, ‘క’ (Ka) సినిమాలే దీపావళి బ్లాక్‌బస్టర్స్. ‘సింగం అగైన్’కు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినా దాని ప్రొడక్షన్ ఖర్చు, క్యాస్టింగ్ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని కేవలం యావరేజ్‌గానే పరిగణింవచ్చు. ఇక ‘లక్కీ భాస్కర్’ అయితే సూపర్ హిట్ సాధించింది.