BigTV English

Sivakarthikeyan : ఓ కమల్‌, రజినీ, విజయ్… తర్వాత శివ కార్తికేయన్‌..

Sivakarthikeyan : ఓ కమల్‌, రజినీ, విజయ్… తర్వాత శివ కార్తికేయన్‌..

Sivakarthikeyan : కొన్ని రోజుల క్రితం ఓ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందంటే… అదో భారీ రికార్డ్‌గా చూసే వాళ్లు. ఇండస్ట్రీ ఏదైనా… 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోలు ఎంత మంది అంటే… చేతి వేళ్ల మీద లెక్కపెట్టేంత తక్కువ మంది, తక్కువ సినిమాలు ఉండేవి. కానీ, ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలు మారాయి. 100 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదు. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇతర ఇండస్ట్రీలోనూ అంతే. ఇప్పుడు మనం తమిళ ఇండస్ట్రీ గురించి చూస్తే… 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇంక ఇండస్ట్రీలో ఎక్కువ కలెక్ట్ చేసిన హీరోలు అంటే… కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ దళపతి. ఈ ముగ్గురు మొదటి స్థానాల్లో ఉంటారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి శివకార్తికేయన్ చేరిపోయాడు. ఆ లిస్ట్ ఏంటి..? ఆ రికార్డులు ఏంటి..? అనేది ఇప్పుడు చూద్ధాం…


రీసెంట్‌గా ఓ మూవీ వచ్చింది. అదే దేశ కోసం ప్రాణ త్యాగం చేసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్. అమరన్ అనే టైటిల్‌తో వచ్చిన ఈ మూవీలో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్ నటించాడు. ముకుంద్ భార్య ఇంధు రెబెక్కా వర్గీస్ పాత్రలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని కమల్ హాసన్ నిర్మించాడు. అక్టోబర్ 31న రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

దీంతో కోలీవుడ్‌లో ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు శివకార్తికేయన్. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 250 కోట్లు కలెక్ట్ చేసింది కేవలం ముగ్గురు అంటే ముగ్గురు మాత్రమే. రజినీ కాంత్, కమల్ హాసన్, విజయ్ దలపతి. వీళ్ల తర్వాత అమరన్ మూవీతో శివకార్తికేయన్ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు.


250 కోట్లకు పైగా కలెక్సన్లు తీసుకొచ్చిన రజినీకాంత్ మూవీస్ అంటే.. 2.o (750 కోట్లు), జైలర్ (650 కోట్లు), రోబో (290 కోట్లు), కబాలి (290 కోట్లు).

ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే… విక్రమ్ (430 కోట్లు) ఇండియన్ 2 (250 కోట్లు)

విజయ్ దలపతి… లియో (618 కోట్లు), గోట్ (460 కోట్లు), బిగిలి (305 కోట్లు), వారిసు (303 కోట్లు), మెర్సల్ (257 కోట్లు), సర్కార్ (303 కోట్లు).

ఇక శివకార్తికేయన్ 12 ఏళ్ల కెరీర్‌లో ఈ అమరన్ మూవీతోనే 250 కోట్ల మార్క్ ను అందుకున్నాడు. దీని తర్వాత డాన్ (122 కోట్లు), డాక్టర్ (102 కోట్లు) మూవీస్ ఉన్నాయి.

శివకార్తికేయన్ ఈ లిస్ట్‌లో యాడ్ అయ్యేలా చేసిన ఈ మూవీ రిలీజ్ అయి… నేటికి 11 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ 250 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటికీ కూడా మంచి టాక్ ఉంది. ఈ నెంబర్ 300 కోట్ల వరకు పెరగొచ్చు అని కూడా ట్రెండ్ పండితులు అంటున్నారు. అయితే ఇక్కడ ఓ చిన్న సమస్య ఉంది. ఈ వారం (నవంబర్ 14న) కంగువ అనే మూవీ వస్తుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీ తమిళలో ఫస్ట్ 1000 కోట్ల మూవీ ఇది అవుతుందని అనుకుంటున్నారు.

ఒకవేళ అలాంటి టాక్ వస్తే… అమరన్ కలెక్షన్లు 300 కోట్ల మార్క్ అందుకోకపోవచ్చు. అలా కాకుండా, కంగువ టాక్  నెగిటివ్ గా వస్తే… శివకార్తికేయన్ 300 కోట్ల  క్లబ్‌లో అడుగుపెట్టకుండా ఎవరూ అడ్డుకోలేరు.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×