Nindu Noorella Saavasam Serial Today Episode: అనామిక ఇచ్చిన పాలు తాగిన మిస్సమ్మ మత్తుగా పైకి అమర్ రూంలోకి వెళ్లి అమర్‌ను గట్టిగా హగ్ చేసుకుంటుంది. కిస్ ఇస్తూ… ఐ లవ్యూ చెప్తుంది. దీంతో అమర్ షాక్ అవుతాడు. వెంటనే మిస్సమ్మను పడుకోమని చెప్తాడు. మిస్సమ్మ వినకుండా ఎందుకండి మీరు నా మాట వినరు అని అడుగుతుంది. సరే వింటానులే నువ్వు పడుకో అంటూ మిస్సమ్మను బెడ్ మీద పడుకోబెట్టి.. అమర్ చూస్తుంటాడు. మిస్సమ్మ నిద్రపోతుంది.
శివరాం తల పట్టుకుని హాల్లోకి వచ్చి నిర్మల అబ్బా పొద్దునే ఈ తల నొప్పి తట్టుకోలేకపోతున్నాను.. కాస్త కాఫీ ఇస్తావా..? పిలుస్తుంటే పలకటం లేదేంటి నిర్మల అంటూ శివరాం అరవగానే.. నిర్మల కళ్లు తెరిస్తే కనబడతాను అంటుంది. దీంతో శివరాం కళ్లు తెరిచి చూసి ఓ తెచ్చావా..? అంటూ కాఫీ తీసుకుని తలనొప్పి ఏంటో పొద్దునే ఇలా పట్టుకుంది అంటాడు. దీంతో నిర్మల కోసంగా నిన్న తమరు వేసిన చిందులకు ఈ మాత్రం అయినా లేకపోతే ఎలా అంటుంది. దీంతో శివరాం నేను చిందులు వేశానా..? అంటాడు. దీంతో నిర్మల ఏం చేశారా..? సిగ్గు లేకపోతే సరి నిమ్ము డార్లింగ్ అనడాలు పాటలు పెట్టుకుని డాన్సులు వేయడాలు అమ్మో నేను వేయలేనని చెప్తే నాకు వయసు అయిపోయిందని చెప్పి ఎగతాళి చేసి నవ్వుతారా..?
నా వయసు అయిపోతే మీ వయసు ఏమైనా వెనక్కి వెళ్తుందా ఏంటి..? ఇంకోసారి కాళ్ల నొప్పులు అనండి అప్పుడు చెప్తాను మీ సంగతి అంటుంది. దీంతో శివరాం షాకింగ్‌గా నాకు తెలియకుండా ఇన్ని చేశానా..? అంటాడు. అవునని నిర్మల చెప్పగానే ఇద్దరూ ఆలోచిస్తుంటారు. ఇంతలో పై నుంచి అనామిక వస్తుంది. దీంతో నిర్మల.. అనామిక, భాగీ ఇంకా కిందకు రాలేదా..? అని అడుగుతుంది. దీంతో లేదు ఆంటీ ఇంకా రాలేదు అని చెప్పగానే నిర్మల రోజు పొద్దునే వచ్చేస్తుందే.. ఇవాళేంటి..? పండగ పూటైనా ఇంకా రాలేదు అని అడుగుతుంది. దీంతో అనామిక అదీ హెడేక్ అంటుంది అని చెప్పగానే.. నిర్మల సరిపోయింది మీ అంకుల్ లాగా భాగీ కూడా రాత్రంతా చిందులు వేస్తూ కూర్చుందా..? అంటుంది నిర్మల.
పైన రూంలో నిద్ర లేచిన మిస్సమ్మకు అంతా మసక మసకగా కనిపిస్తుంది. పక్కనే కాఫీ కలుపుతున్న అమర్ కూడా మసకగా కనిపిస్తుంటాడు. అమర్ కాఫీ ఇవ్వగానే.. ఏంటని చూసి కాఫీ నాకా అని అడుగుతుంది మిస్సమ్మ. దీంతో అమర్ ఈ రూంలో నువ్వు నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా..? అని అడుగుతాడు. లేదని మిస్సమ్మ చెప్పగానే.. అమర మరి తీసుకో అంటాడు. కాఫీ తీసుకుని తాగుతూ.. మిస్సమ్మ శ్రీరామనవమి రేపైతే ఇవాళేంటి రెడీ అయ్యారు అంటుంది. దీంతో అమర్ ఏయ్ లూజ్ ఒకసారి టైం చూడు అంటాడు. మిస్సమ్మ టైం చూసి తొమ్మిది అయింది అంటుంది. దీంతో అమర్ రాత్రి తొమ్మిది కాదు ఉదయం తొమ్మిది అవుతుంది అని అమర్ చెప్పగానే.. మిస్సమ్మ వెంటనే నిద్రలేచి అంతా సర్దుతుంది. తర్వాత శ్రీరామ నవమి పూజ కోసం అంతా రెడీ చేస్తుంది.
తర్వాత మనోహరి దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి కోల్‌కతా వెళ్లాక అక్కడ పెళ్లి చేసుకున్నావు. నువ్వేంటో.. నీ గతమేంటో..? నీ భర్త ఎవరో నువ్వు దాచిన నిజాలు ఏంటో నువ్వు బాధ పెట్టిన మనుషులు ఎవరో అన్ని కనుక్కుంటా మను ఇక నుంచి ఒక్క రోజు కూడా నిన్ను మనఃశాంతిగా ఉండనివ్వను. కాదు నా పంతం నెగ్గాలి ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం భాగమతి టూ పాయింట్ ఓను చూస్తావు. అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించి ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చేసి నీ నోటితోనే నిజం చెప్పిస్తా మను అంటూ బెదిరించడంలో మనోహరి భయపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?