Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసింది. అయితే ఇలాంటి సమయంలో కూడా ఆయన నుంచి అభిమానులు సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో ‘హరిహర వీరమల్లు’ సినిమా కూడా ఒకటి. ఎప్పుడో 2021లో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం (AM.Ratnam) సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ(Jyoti Krishna) దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహించాల్సింది. కానీ కొన్ని కారణాలవల్ల ఆయన తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన అనుష్క శెట్టి (Anushka Shetty) తో ‘ఘాటీ’ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను జ్యోతి కృష్ణ తీసుకున్నారు.
పోస్ట్ పోన్ లో కూడా రికార్డు సృష్టించిన హరిహర వీరమల్లు..
ఇక ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్ (Nidhi Agerwal), అర్జున్ రాంపాల్(Arjun Rampal), బాబీ డియోల్ (Bobby Deol), అనుపమ్ ఖేర్ (Anupam Kher) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి (M.M.Keeravani)సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ్, కన్నడ,మలయాళం, జపనీస్, హిందీ, బెంగాలీ , చైనీస్, ఒడియా, మరాఠీ, రష్యన్ తో పాటు ఉక్రేయిన్ భాషలలో విడుదల కాబోతోంది అంటూ వార్తలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఆ రికార్డు ఎలాంటిదో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఒక సినిమా రెండు లేదా మూడుసార్లు వాయిదా పడుతుంది.. కానీ ఈ సినిమా ఏకంగా 11 సార్లు వాయిదా పడి ఇప్పుడు ఎట్టకేలకు మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికైనా ఈ సినిమా విడుదలవుతుందా అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేయగా.. గత కొన్ని రోజుల క్రితం అధికారికంగా చిత్ర బృందం పోస్టర్తో సహా రిలీజ్ చేయగా.. అభిమానులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. అలా ఏకంగా 11 సార్లు వాయిదా పడి అత్యధిక సార్లు పోస్ట్ పోన్ అయిన సినిమాగా రికార్డు సృష్టించింది హరిహర వీరమల్లు.
ఆకట్టుకున్న పాటలు..
ఇకపోతే ఈ సినిమా నుండీ మొదటి పాట ‘మాట వినాలి’ అంటూ వచ్చిన ఈ పాట 2025 జనవరి 17న విడుదలైంది. ఈ పాటకు యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత 2025 ఫిబ్రవరి 24న ‘కొల్లగొట్టినాదిరో’ అనే రెండో పాట కూడా విడుదల చేయగా.. ఈ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక త్వరలో మిగతా పాటలను కూడా రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Deepika Padukone: దీపికా ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?