BigTV English
Advertisement

HBD Prabhas : బిర్యానీ కోసం ప్రభాస్ ను అర్దరాత్రి దాకా వెయిట్ చేయించిన స్టార్ హీరో… క్లైమాక్స్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్

HBD Prabhas : బిర్యానీ కోసం ప్రభాస్ ను అర్దరాత్రి దాకా వెయిట్ చేయించిన స్టార్ హీరో… క్లైమాక్స్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్

HBD Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మంచి భోజన ప్రియుడు అన్న విషయం తెలిసిందే. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఓ స్టార్ హీరోకి లేట్ నైట్ బిర్యానీ తినిపించడం నుంచి 15 రకాల బిర్యానీలు లాగించడం దాకా ప్రభాస్ ఫుడ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


స్టార్ హీరోతో అర్ధరాత్రి బిర్యానీ

ప్రభాస్ మంచి భోజనం ప్రియుడు మాత్రమే కాదు ఆయన తనతో పాటు పనిచేసే నటీనటులకు జీవితంలో మర్చిపోలేని ఆతిథ్యాన్ని ఇచ్చి సంతోష పెడతారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభాస్ (Prabhas) ఓ స్టార్ హీరో తో కలిసి డిన్నర్ ప్లాన్ చేశారట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూర్య. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా సూర్య ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ ఫిలిం సిటీలో సూర్య (Suriya) ప్రభాస్ ని కలుసుకున్నారట. అయితే ఆ సందర్భంగా ప్రభాస్ ఈ రాత్రి కలిసి డిన్నర్ చేద్దామని అడిగారట. దీంతో సూర్య కూడా ఓకే చెప్పారు. అయితే సాధారణంగా ఫుడ్ హోటల్ నుంచి లేదా ప్రొడక్షన్ మెస్ నుంచి వస్తుందని సూర్య అనుకున్నారట.


సూర్య (Suriya) సినిమా షూటింగ్ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య పూర్తి అవుతుందని అనుకోగా, అది 10 నుంచి 11:30 ఒక గంటల వరకు సాగిందట. దీంతో సూర్య ప్రభాస్ ని రేపు కలిసి సారీ చెబుదాం అనుకున్నారట. ఇక షూటింగ్ అయిపోయాక ఆయన తన రూమ్లో కారిడార్ లో నడుస్తున్న టైం లో డోర్ చప్పుడు రావడంతో తిరిగి చూస్తే, ప్రభాస్ కనిపించారట. మీరు స్నానం చేసి రెడీగా ఉండండి, డిన్నర్ చేద్దామని ప్రభాస్ చెప్పారని సూర్య ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అయితే అప్పటికి టైం 11:30 కావడంతో సూర్య షాక్ అయ్యారట. తనకోసం అప్పటిదాకా ప్రభాస్ (Prabhas) డిన్నర్ చేయకపోవడం, ఎదురు చూడడం అనేది ఊహించలేదని సూర్య చెప్పుకొచ్చారు. అయితే ఆ టైంలో ప్రభాస్ ఇంటి నుంచి ఆహారాన్ని తెప్పించారని, ఆయన తల్లి బిర్యానీని చేసి పంపించారని పేర్కొన్నారు సూర్య. ఇక తన జీవితంలో అంత మంచి బిర్యానీని ఎప్పుడూ తినలేదు అంటూ ఆ ఇంటర్వ్యూలో సూర్య తనకు ప్రభాస్ కి మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు.

15 రకాల బిర్యానీలు…

ఇక ప్రభాస్ (Prabhas) ఫుడ్ గురించి చెప్పుకోవాల్సిన కథ ఇది ఒక్కటే కాదు. ‘బాహుబలి’ సినిమా చేసిన టైంలో ప్రభాస్ కఠినమైన డైట్ ని ఫాలో అయ్యారు. అయితే ఆయన నెలకోసారి చీట్ డైట్ ఫాలో అయ్యేవారట. ఆ టైంలో ఏకంగా ప్రభాస్ 10 నుంచి 15 రకాల బిర్యానీలు ముందర పెట్టుకొని కనిపించడం రాజమౌళిని ఆశ్చర్యానికి గురి చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి వెల్లడించారు. ఇక ప్రభాస్ తినడం మాత్రమే కాదు సహా నటులకు ఫుడ్ పెట్టడంలో కూడా ఫుల్ పాపులర్. అలా ప్రభాస్ ఆతిథ్యాన్ని స్వీకరించిన వారిలో సైఫ్ అలీ ఖాన్, దీపిక పదుకొనే తదితరులు ఉన్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×