BigTV English

Husband Mistakes: మగవారూ.. మీరు చేసే ఈ తప్పులు మీ వివాహాన్ని విడాకులు అయ్యేలా చేస్తాయి, జాగ్రత్త

Husband Mistakes: మగవారూ.. మీరు చేసే ఈ తప్పులు మీ వివాహాన్ని విడాకులు అయ్యేలా చేస్తాయి, జాగ్రత్త

Husband Mistakes: హిందూ భారతీయ వ్యవస్థలో వివాహానికి ఎంతో విలువ ఉంది. ఒక మనిషికి కుటుంబ జీవితాన్ని అందించడమే వివాహం ప్రధాన ఉద్దేశం. జీవితంలో ఒకరికి మరొకరు తోడు ఉండాలని చెప్పడమే ఈ పెళ్లి కాన్సెప్ట్. అయితే ఆధునిక సంబంధాలు, వివాహాలు ఈ రోజుల్లో చాలా క్లిష్టంగా మారిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంత త్వరగానే ఆ సంబంధాన్ని తెంచుకునేలా ప్రవర్తిస్తున్నారు. కొందరికి వివాహాలు విజయవంతం అయితే మరికొందరి వివాహాలు పెటాకులు అవుతున్నాయి. మగవారు చేసే కొన్ని తప్పులు వారి వివాహాలను నాశనం చేస్తాయని చెబుతున్నారు మానసిక శాస్త్రవేత్తలు.


భాగస్వామిని చులకనగా చూడడం
మిమ్మల్ని వివాహమాడి మీ జీవితంలోకి వచ్చిన భాగస్వామికి మీరు ఎంతో విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కొందరు వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని పట్టించుకోరు. వారికి ఏమాత్రం విలువ ఇవ్వరు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వారి పైన ప్రేమ, శ్రద్ధ చూపించరు. దీనివల్ల వారి సంబంధం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. మొదట్లో ఇది చిన్న సమస్యగా అనిపించినప్పటికీ.. రోజులు గడుస్తున్న కొద్దీ అది పెద్ద సమస్యగా మారి వారి మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. మీ వివాహ జీవితం సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా మీ భాగస్వామికి విలువ ఇచ్చి తీరాలి. అప్పుడే మీ వివాహం కలకాలం నిలిచి ఉంటుంది.

ఆమె మాటకు విలువ
ప్రతి భార్య ఇతరులకు ఫిర్యాదు చేసే విషయాల్లో మొదటిది.. తమ భర్త తమ మాట వినడం లేదని. పురుషులు కూడా  తమ భార్య మాట వినేందుకు ఇష్టపడరు. అలా వినకపోవడం అనేది వారి పెళ్లిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మగవారు తమ భార్యలు చెప్పే సమస్యలను, భయాలను వినాల్సిన అవసరం ఉంది. అలాగే వాటికి పరిష్కారాలు చూపించాల్సిన అవసరం కూడా ఉంది. భార్యలు చెప్పేది వినడం అలవాటు చేసుకుంటే మీరు మీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు. ముందు ఆమె ఏమి చెబుతుందో ప్రశాంతంగా కూర్చొని వినేందుకు ప్రయత్నించండి. మీరు ఆమె చెప్పిన పని చేయకపోయినా పర్వాలేదు, కనీసం వింటే చాలు ఆమె ఎంతో సంతోషిస్తుంది.


Also Read: మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడకూడని కొన్ని విషయాలు ఇవిగో, వీటిని మాట్లాడితే బంధానికి బీటలే

ఇంటి పనుల్లో సాయం
పరిస్థితులు మారిపోయాయి.. కేవలం మగవారు మాత్రమే కాదు ఆడవారు కూడా ఉద్యోగాలకు వెళుతున్నారు. కానీ ఇంటి పనులు మాత్రం ఇప్పటికీ ఆడవారి బాధ్యతగానే మిగిలిపోయాయి. ఇదే ఎక్కువ మంది భార్యలను ఇబ్బంది పెడుతున్న సమస్య. జీవిత భాగస్వామికి తామే ఆర్థికంగా సాయం చేస్తున్నప్పుడు… తమకు ఇంటి పనుల్లో భర్త ఎందుకు సాయం చేయడని ఎంతోమంది మహిళామణులు వాదిస్తున్నారు. ఇదే తగాదాలకు కారణం అవుతున్నాయి. మగవారు కూడా మారాల్సిన అవసరం ఉంది. తమతో పాటు సమానంగా ఉద్యోగం చేస్తున్న మహిళలను ఆదర్శంగా తీసుకొని ఇంటి పనుల్లో భాగస్వాములు అవ్వాలి. తాము ఉండే ఇల్లు, పిల్లలను చూసుకోవడం ఏ మాత్రం చిన్నతనం కాదు. ఇంటి పనుల్లో భాగస్వానికి సహాయం చేస్తే ఆ ఇల్లు నందనవనంలా మారుతుంది.

భార్య పట్ల ఎంతో కొంత సానుభూతి భర్తకు ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటా బయట కష్టపడే భార్య… భర్త నుంచి కోరుకునేది విలువ, కాసింత ప్రేమ. అది కూడా ఇవ్వడానికి సమయాన్ని కేటాయించకపోతే ఆ వివాహం సంపూర్ణం కాదు.

ఇంటికి బంధువులు, స్నేహితులు ఎవరు వచ్చినా కూడా మీ భార్యకు వారి ముందు విలువ ఇవ్వండి. బంధువుల ముందే కసరడం, విసుక్కోవడం వంటివి చేయకండి. ఇవి మీపై ఆమెకు విరక్తి కలిగించేలా చేస్తాయి. పెళ్లయ్యాక ఉత్తమ జీవిత భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి పురుషుడు అర్థం చేసుకోవాలి. మీ సలహాలు మాత్రమే కాదు, ఆమె సలహాలను కూడా మీరు వినాలి. వ్యక్తిగత జీవితం ఎంత ఆనందంగా ఉంటే మీ వృత్తి గత జీవితం కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది.

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×