HBD Prince Cecil:ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు హీరో ప్రిన్స్ సెసిల్ (Prince Cecil ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1993 జూన్ 3న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జన్మించిన ప్రిన్స్..” బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్” లో బీటెక్ పూర్తి చేశారు. ‘బస్ స్టాప్’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. కానీ ఈయనకు మరింత క్రేజ్ లభించింది బిగ్ బాస్ ద్వారానే అని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR ) హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని.. 57వ రోజు షో నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే అక్కడ చేసింది కొద్ది రోజులే అయినా బిగ్ బాస్ తోనే భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మళ్లీ చిత్రాలలో నటించిన ఈయన.. అలా మనసును మాయ సేయకే, అశ్వద్ధామ, మరలా తెలుపన ప్రియా వంటి తెలుగు సినిమాలలో నటించారు.
దానివల్లే ఎదగలేకపోయాను – ప్రిన్స్
ఇకపోతే హీరో ప్రిన్స్ 19 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఆ చిన్న తప్పు వల్ల స్టార్ హీరోగా ఎదగలేకపోయారు.. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. యంగ్ హీరోగా యువతకు పరిచయమైన ప్రిన్స్ ఆ తర్వాత తనకు వచ్చిన ఆఫర్లలో నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ ముందుకు వెళ్ళాడు. అటు హీరో గానే కాకుండా ఇటు పలువురు స్టార్ హీరోల సినిమాలలో కీరోల్స్ కూడా చేశాడు. ఇక అందులో భాగంగానే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రిన్స్ తన కెరియర్ గురించి మాట్లాడుతూ.. నేను 19 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. 21 ఏళ్ల వయసులో హీరోగా మారాను. ఆ తర్వాత నాకు సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేక ఇబ్బంది పడ్డాను. ఒక రకంగా చెప్పాలి అంటే, ఇది కూడా నా తప్పే. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పెద్దగా ఎవరిలోనూ కలిసే వాడిని కాదు. ఆ తప్పు వల్ల నాకు ఎవరితోనూ పరిచయం పెద్దగా ఏర్పడలేదు. అందుకే సరైన గైడెన్స్ లభించలేదు. దానివల్లే నేను నిలదొక్కుకోలేకపోయాను “అంటూ అసలు విషయాన్ని తెలిపారు ప్రిన్స్.
అలా చేయడం నాకు ఇష్టం లేదు – ప్రిన్స్
నేను ,నవీన్ చంద్ర(Naveen Chandra), సుధీర్ బాబు(Sudheer babu), సందీప్ కిషన్ (Sandeep Kishan) ఇలా దాదాపుగా అందరం ఒకేసారి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము . ఎవరి దారిలో వాళ్ళు ముందుకు వెళుతూనే ఉన్నాం. అయితే ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాటిని మరిచిపోయి మళ్లీ ముందుకు వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది. ఇక నా లైఫ్ లో కూడా లవ్ , బ్రేకప్ లు చాలానే ఉన్నాయి. కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతే ముందుకు వెళ్లలేను కదా.. ఇప్పుడు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా కెరియర్ పై ఫోకస్ పెట్టాను” అంటూ తెలిపారు. ఇకపోతే హీరో ప్రిన్స్ ఎవరితో కలవడు అన్న మాటలపై కూడా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అలా ఉండేవాడినేమో కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. అందరితోనూ కలుస్తున్నాను. వాళ్లతో హ్యాపీగా మాట్లాడుతున్నాను..ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాను. కానీ వాళ్లతో దిగిన ఫోటోలను మాత్రం సోషల్ మీడియాలో పెట్టి పబ్లిసిటీ చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. ఉన్నంతలోనే సంతోషంగా బ్రతకాలి అనుకుంటున్నాను. అంటూ తెలిపారు ప్రిన్స్. ఇకపోతే మహేష్ బాబు(Maheshbabu) అంటే ఇష్టమని చెప్పిన ఈయన.. రాజమౌళి(Rajamouli ) డైరెక్షన్లో సినిమా చేయాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు.