HBD Sarika: లోక నాయకుడిగా పేరు సొంతం చేసుకున్న కమలహాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం మణిరత్నం (Maniratnam )దర్శకత్వంలో థగ్ లైఫ్ (Thug Life)సినిమాతో జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈయన మాజీ భార్య సారిక (Sarika) పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి ఎవరికీ తెలియని పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సారిక కమలహాసన్ భార్య మాత్రమే కాదు ప్రముఖ నటి కూడా 80వ దశకంలో ఈమె బాగా పాపులర్. ఢిల్లీలోని రాజ్ పుత్ ల వంశంలో జన్మించిన ఈమె జీవితం మాత్రం కష్టాలమయం. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడం, కమలహాసన్తో ప్రేమ, పెళ్లి , విడాకులు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఒకటి కాదు సారిక తన జీవితాన్ని కొనసాగించేందుకు ఇప్పటికీ కూడా కష్టపడుతూనే ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఒకవైపు భర్త స్టార్ హీరో.. కూతురు పాన్ ఇండియా హీరోయిన్.. అయినా సరే సారిక జీవితం మాత్రం నరకానికి కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు ఆమె సన్నిహితులు. ఇకపోతే ఆమె జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యమైన ఘట్టాలను, కీలక మలుపులను చూస్తే మాత్రం ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు అని చెప్పవచ్చు.
నాలుగేళ్లకే నటిగా అరంగేట్రం..
ఇక సారిక విషయానికి వస్తే.. నాలుగేళ్ల పసిప్రాయంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో అప్పటి నుంచే పని చేయడం మొదలుపెట్టారట. సారిక చదువుకోవడానికి బదులు సినీ స్టూడియోల వెంటపడుతూ చివరికి ఆడుకొనే వయసుని కాస్త కష్టపడడానికే ధారపోసింది. ఒక బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు బి.ఆర్ చోప్రా రూపొందించిన ‘హమ్ రాజ్’ అనే చిత్రంలో మాస్టర్ సూరజ్ పేరుతో ఒక అబ్బాయి పాత్ర వేసి బాలనటి గా పేరు తెచ్చుకుంది. అలా మొదలైన నటి సారిక ప్రయాణం 21 ఏళ్ల ప్రాయంలో చేతిలో చిల్లి గవ్వ లేకుండా కట్టుబట్టలతోనే అటు ఇంటిని, తల్లిని వదిలేసి ఏం చేయాలో తెలియక కారుని ఇంటిగా చేసుకొని గడిపిందట సారిక. ఇకపోతే ఈమె కెరియర్ ను మలుపు తిప్పిన అంశం ఏదైనా ఉందంటే అది లోకనాయకుడు కమలహాసన్ తో పెళ్లి. 28 ఏళ్ల వయసులో ఆయనను వివాహం చేసుకున్న ఈమెకు అప్పటివరకు తోడుగా ఉన్న నటనను కూడా వదిలేసింది. వివాహం తర్వాత నటిగా కెరియర్ ను పక్కనపెట్టి టెక్నీషియన్ గా మారిన ఈమె.. కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక తన భర్త కమలహాసన్ నటించిన ‘హే రామ్’ సినిమాకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడమే కాకుండా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా నేషనల్ అవార్డును కూడా అందుకుంది సారిక. కమలహాసన్త వివాహం తర్వాత ఆమె జీవితం బంగారుమయం అయిపోయింది.
జీవితం మొత్తం కష్టాలమయం..
అలా 15 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరిద్దరి కాపురం ఒక్కసారిగా బీటలు వారింది. దీంతో తన కూతుర్లు ఇద్దరు శృతిహాసన్(Shruti Haasan), అక్షర హాసన్(Akshara Haasan) ను తీసుకొని ముంబైకి వెళ్ళిపోయింది. చేతిలో పని లేదు.. పిల్లలిద్దరూ చిన్నవాళ్లు.. వారిని పోషించడానికి సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ నటనను మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తండ్రి దగ్గర ఉన్నప్పుడు లగ్జరీ కార్లు విమానాలలో తిరిగిన వీరు చివరికి వీధి రిక్షాలలో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఒంటరి జీవితం ఇద్దరు పిల్లల్ని పోషించడం కష్టంగా మారడంతో మళ్లీ నటన మొదలుపెట్టిన ఈమెకు ఆ సమయంలో బ్యాంకు ఖాతా కూడా లేదంటే ఎవరైనా నమ్మగలరా? కరోనా సమయంలో తన దగ్గర డబ్బులు లేవని ఒక ఇంటర్వ్యూలో ఆవేదన కూడా వ్యక్తం చేసింది. లాక్డౌన్ సమయంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని స్వయంగా శృతిహాసన్ కూడా ఒక సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే.అలా జీవితాన్నే నరకంగా మార్చుకుంది సారిక.
also read:HBD Radha: అందంలోనే కాదు ఆస్తుల్లోనూ తోపే.. రాధా ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?